ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ హిట్ అందుకొని మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన హీరో రామ్ పోతినేని. ఆ సినిమాలో ఆయన చూపించిన సరికొత్త వైవిధ్యభరితమైన యాటిట్యూడ్ కి ప్రేక్షక లోకం దాసోహం అయి పోయింది. ఆ తర్వాత ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని ఆయన చేసిన రెడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొంత ప్రేక్షకులను నిరాశ పరిచింది అని చెప్పవచ్చు. కాన్సెప్ట్ కు మంచి మార్కులు పడ్డాయి కానీ కమర్షియల్ గా ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. అందుకే ఓ భారీ విజయం అందుకున్న తర్వాత వెంటనే యావరేజ్ హిట్ అందుకొని వెనుకబడి పోయాడు రామ్.

ఈ నేపథ్యంలోనే ఆయన చేసే తదుపరి చిత్రం సూపర్ హిట్ అందుకోవాలనే నేపథ్యంలో తమిళ దర్శకుడు లింగుస్వామి తో కలిసి ఓ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కృతి శెట్టి నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తమిళంలో కూడా ఈ సినిమా విడుదల అవుతుంది అని చెప్పడం తో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను రివీల్ చేసింది చిత్ర బృందం.

ది వారియర్ అనే  టైటిల్ ను నిర్ణయించినట్లుగా చిత్రబృందం వెల్లడించగా ఈ సినిమా టైటిల్ పట్ల కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు రామ్ అభిమానులు. ఈ సినిమా టైటిల్ విషయంలో ఓ హీరో తో పోటీపడినట్లు వార్తలు వస్తుండగా ఈ టైటిల్ పై ఇంత రచ్చ చేయడం అవసరమా అని అభిమానులు వాదిస్తున్నారు. ఈ టైటిల్ కూడా పెద్దగా బాగో లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తన స్థాయికి తగ్గ హీరోతో వాదన చేస్తే బాగుంటుంది చిన్న హీరోతో తగాదా పెట్టుకోవడం ఏంటి ఈ సినిమా టైటిల్ ను వదిలేస్తే మంచిది అని వారు వెల్లడిస్తున్నారు. మాస్ ను ఆకట్టుకునే మరో టైటిల్ ను పెట్టలానే విధంగా సూచిస్తున్నారు. ఆవిధంగా ఈ టైటిల్ విషయంలో రామ్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత రామ్సినిమా చేస్తాడో అన్న విషయంపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. తొందర్లోనే ఈ విషయాన్ని ప్రేక్షకులకు వెల్లడించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: