ప్రస్తుత పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ ఎప్పుడు విడుదల అవుతుందో రాజమౌళికి కూడ తెలియని సమాధానంలేని ప్రశ్న. దీనితో ప్రస్తుతం జక్కన్న ఖాళీగా ఉండలేక మహేష్ తో తీయబోయే మూవీ కథ స్క్రిప్ట్ గురించి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు జరుపుతూ ఈఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయితే రాజమౌళిని కార్నర్ చేస్తూ కోర్టులలో ‘ఆర్ ఆర్ ఆర్’ కథకు సంబంధించి పడుతున్న కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ ఉండటం రాజమౌళికి ఒకవిధంగా ఊహించని షాక్ అనుకోవాలి.


‘ఆర్ ఆర్ ఆర్’ కథ రీత్యా 1920 ప్రాంతాలలో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ తమ అజ్ఞాత వాసంలో ఉత్తర భారత దేశంలోని ఒకప్రాంతంలో కలిసినట్లుగా ‘ఆర్ ఆర్ ఆర్’ కథను వ్రాసారు. ఈవిషయాన్ని స్వయంగా రాజమౌళి అనేకసార్లు చెప్పడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ కథపై అందరికీ క్లారిటీ ఉంది. అయితే ఇక్కడే ఈకథకు చరిత్రకు సంబంధం లేకపోవడంతో అనేకమంది ‘ఆర్ ఆర్ ఆర్’ కథ విషయమై కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. చరిత్రలో ఎక్కడా చెప్పని విధంగా అల్లూరి కొమరం భీమ్ లు కలవడం ఏమిటి అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


అంతేకాదు ఈసినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వద్దని కూడ ఆమె కోరుతున్నారు. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తున్నారని అభిప్రాయపడుతూ అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఒక పత్రికా  ప్రకటన విడుదల చేశారు. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో చరిత్ర వక్రీకరణ చేయడమే కాకుండా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజును బ్రిటీష్ పోలీసుగా చూపించడం ఏమిటి అంటూ పడాల వీరబధ్రరావు తీవ్ర అభ్యంతరాలు వ్యక్త పరుస్తున్నారు.





ఈవిషయమై హైకోర్ట్ ను ఆశ్రయించడమే కాకుండా అల్లూరి చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను ఈమూవీని తొలిగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాదు అల్లూరి సీతారామరాజు చరిత్ర చారిత్రక సంపద అని ఎవరికి వారు వారికి నచ్చిన విధంగా ఆచరిత్రను మార్పులు చేస్తే తాను అంగీకరించను అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక వీరభద్రరావు తండ్రి పడాల రామారావు స్వాతంత్ర సమరయోధులు కావడమే కాకుండా ఆయన శతాధిక గ్రంధకర్తగా ఉంటూ అల్లూరి జీవిత చరిత్రను ఆంధ్రశ్రీ పేరిట ఒక ప్రామాణిక గ్రంధంగా రచించారు. అలాంటి మహనీయుల జీవిత చరిత్రను కల్పితం అంటూ తప్పుగా చెబితే భావి తరాలు ఎలా అర్ధం చేసుకుంటాయని వీరభద్రరావు ప్రశ్నిస్తున్నప్రశ్నలకు రాజమౌళి దగ్గర అసలు సమాధానాలు ఉంటాయ అంటూ చాలామంది సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: