మోడల్ గా కెరియర్ ప్రారంభించి ఆ విధంగా అవకాశాలను అందుకుంటూ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన దివి ఎప్పుడైతే బిగ్ బాస్ కి వెళ్లిందో అప్పటి నుండి ఆమె రేంజ్ మారిపోయింది. మత్తెక్కించే కళ్లతో ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంటున్న దివి వాద్యా ప్రస్తుతం సినిమాల్లో మంచి రోల్స్ తెచ్చుకుంటుందని తెలుస్తుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన దివి హీరోయిన్ గా స్టార్ డం తెచ్చుకోవాలని చూస్తుంది. బిగ్ బాస్ తో వచ్చిన ఫాలోయింగ్ తో తన ఫాం కొనసాగిస్తున్న దివి క్యాబ్ స్టోరీస్ అనే ఓ ప్రైవేట్ ఆల్బం తో ఆడియెన్స్ ని మెప్పించింది

ఇక లేటెస్ట్ గా ఈ అందాల భామని మరో అందాల భామ అషు రెడ్డి ఇంటర్వ్యూ చేసింది. ప్రముఖ ఛానెల్ లో ఈ ఫన్ ఫీస్ట్ చిట్ చాట్ జరిగింది. ఈ క్రమంలో దివి తన లైఫ్ బిగ్ బాస్ కు వెళ్లడానికి ముందు బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక ఎలా మారిందో చెప్పింది. మోడల్ గా ఎన్నో ర్యాంప్ వాక్ లు చేస్తేనో ఓ మెడల్ వస్తుంది. కానీ బిగ్ బాస్ లో ఒక్కసారి ఛాన్స్ వస్తే లైఫ్ మారిపోతుందని చెప్పింది దివి. బిగ్ బాస్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళా శంకర్ లో అమ్మడు ఛాన్స్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవిని దగ్గరా చూడటంపై ఆమె తన సంతోషాన్ని వ్యక్తపరచింది. ఇక మరోపక్క  తనని స్క్రీన్ మీద చాలా బాగుంటావని గ్రీకువీరుడు, మన్మథుడు నాగార్జున సర్ చెప్పడం అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదని చెప్పింది.

తనకు ఫ్రెండ్స్ అంటే ఇష్టమని కాకపోతే చాలా నిజాయితీగా ఉండాని. ఇక తనకు ఇప్పుడు బోయ్ ఫ్రెండ్ లేడని అన్నది దివి. ఈలోగా అషు రెడ్డి బోయ్ ఫ్రెండ్ కావాలా అంటె యెస్ ఐ వాంట్ ఏ బోయ్ ఫ్రెండ్ అని చెప్పింది దివి. ఫన్ ఫీస్ట్ ప్రోమోనే సూపర్ ఎంటర్టైన్ అనిపించగా ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ దివి, అషు రెడ్డిల చిట్ చాట్ ప్రేక్షకులను సూపర్ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు.





మరింత సమాచారం తెలుసుకోండి: