ఇటీవల కాలంలో యువ హీరోలు తమ సత్తా చాటుతూ ప్రేక్షకులను విపరీతంగా అలరింప చేస్తున్నారు. సినిమాలు ఏ విధంగా ఉన్నా కూడా తమ నటనతో ప్రేక్షకులను అలరించాలని చెప్పి వారు ఆ విధమైన మంచి ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నారు. గత రెండేళ్లలో హీరోలు టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయం కాగా వారు చాలామంది ఇప్పుడు మంచి మంచి అవకాశాల తో ముందుకు వెళుతున్నారు. అలా శ్రీకాంత్ కుమారుడు రోషన్ నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యి హ్యాండ్సం హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.

అయితే ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ పెళ్లి సందడి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దసరా సందర్భంగా ఈ చిత్రం విడుదల కాగా ఈ సినిమాలో ఆయన నటించిన తీరుకు లోకం దాసోహం అయిందని చెప్పాలి. సినిమా ఫలితం కొంత తేడా వచ్చినా కూడా తన నటనతో డాన్సులతో అందరినీ ఆకట్టుకున్నాడు. రెండో సినిమాను రాఘవేంద్రరావు లాంటి దర్శకుడితో కలిసి చేసి హీరోగా పాతుకు పోయాడు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పెద్ద సంస్థలతో సినిమా చేస్తుండడం విశేషం. 

జాతి రత్నాలు సినిమా నిర్మించి భారీ సక్సెస్ సాధించిన దర్శకుడు నాగ అశ్విన్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై చేయబోతున్న ఓ చిన్న సినిమాలో హీరోయిన్ గా శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఎంపిక చేసుకోకపోతే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇక టాలీవుడ్ లో భారీ భారీ సినిమాలను తెరకెక్కిస్తు అగ్ర సంస్థ గా ఎదుగుతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ వారు చేసే ఓ సినిమాలో హీరోగా రోషన్ ను ఎంపిక చేసుకోవడానికి చూస్తున్నారు. ఆ విధంగా టాలీవుడ్ లో అగ్ర సంస్థలు గా ఉన్న రెండు సినిమా సంస్థలు  ఈ కుర్రహీరో ను ఎంపిక చేసుకోవడం శ్రీకాంత్ అభిమానులకు తెగ సంతోషపరుస్తుంది. మరి ఈ రెండు చిత్రాలతో రోషన్ ఏ విధమైన స్టార్డం అందుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: