కామెడీ చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తున్న దర్శకుడు మారుతి. తొలుత అతి తక్కువ బడ్జెట్ తో ఈరోజుల్లో అనే సినిమా చేసి ప్రేక్షకులను విపరీతంగా అందించాడు మారుతి. అలా ఆ సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన ఆ తరువాత పెద్ద హీరోలతో సినిమా చేయడం మొదలు పెట్టాడు. ఆయన సినిమాలు కూడా మంచి సక్సెస్ లు సాధిస్తూ ఉండడంతో ఆయనకు డిమాండ్ కూడా టాలీవుడ్ లో పెరిగిపోయింది. ఏ దర్శకుడికి సాధ్యం కాని విధంగా వెరైటీ వెరైటీ కాన్సెప్ట్ లతో సినిమా చేయడం ప్రత్యేకత.

ఆ విధంగా ప్రేక్షకులు వద్దన్న ప్రతిసారి సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు. అలా ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ అనే టైటిల్ ను బట్టి ఈ సినిమా ఎంత మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని అర్థమవుతుంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ఆయన సినిమా అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ చిన్న సినిమాల దర్శకుడు ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం ఒకింత ప్రేక్షకులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు.

పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన తర్వాత ప్రభాస్ చిన్న సినిమాలను ముఖ్యంగా ఒక భాషకే పరిమితం అయ్యే సినిమాలను చేయడం లేదు. ఆ విధంగానే ఆయన ఇప్పుడు తీసిన సినిమాలన్నీ కూడా పం ఇండియా సినిమాలే కావడం విశేషం.ఈ నేపథ్యంలో తాజాగా మారుతి ప్రభాస్ కోసం రాజా డీలక్స్ అనే ఓ కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్టోరీ వ్రాశాడట. దాన్ని ప్రభాస్ కు కూడా వినిపించి ఓకే చేయించుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా అయితే ఓకే చేశారు కానీ ఎప్పుడు చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆయన ఇప్పుడు ఒప్పుకున్న సినిమాల ప్రకారం 2026 సంవత్సరం దాకా డేట్లు లేవు. ఈ నేపధ్యంలో ఏదైనా సినిమా జరిగితే కానీ ఈ సినిమా చేయడం కష్టం. కాబట్టి మారుతి దర్శకుడికి ఛాన్స్ కొట్టేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: