నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇటీవలే 'అఖండ' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. అటు ఓటీటీలో కూడా 'అన్ స్టాపబుల్' టాక్ షో తో తన సత్తా చాటుతున్నాడు. హీరోగానే కాకుండా ఇప్పుడు హోస్ట్ గానూ బాలయ్య ని చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో హోస్ట్ చేసిన షో కి రాని రెస్పాన్స్.. బాలయ్య టాక్ షో కి వచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బాలయ్య క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో. ఇక బాలయ్యతో ఇలాంటి షో చేయాలనే అల్లు అరవింద్ ఆలోచన విజయవంతమైందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు బాలయ్యతో ఏకంగా సినిమానే ప్లాన్ చేయాలని చూస్తున్నాడు అల్లుఅరవింద్.

తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బాలయ్య ను హీరోగా పెట్టి ఓ భారీ బడ్జెట్ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట ఈ నిర్మాత. అల్లు అరవింద్ తో బాలయ్య కు ఉన్న  బాండింగ్ కారణంగా ఆయన నో చెప్పే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి వీరి కాంబినేషన్లో సినిమా రావడం పక్కా అని చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అంతేకాదు ప్రస్తుతం అల్లు అరవింద్ కొందరు దర్శకులతో బాలయ్య సినిమా విషయమై డిస్కషన్స్ కూడా జరుపుతున్నారట. ఒక్కసారి డైరెక్టర్ కనుక ఫైనల్ అయితే వెంటనే ఈ సినిమాని ఆలస్యం చేయకుండా అఫీషియల్గా అనౌన్స్ చేయాలని అల్లు అరవింద్ చూస్తున్నారట.

ఇక గీతా ఆర్ట్స్ లో ఇప్పటివరకు ఎక్కువగా మెగా హీరోలతో సినిమాలు నిర్మించారు అల్లు అరవింద్. అప్పట్లో వరుసగా చిరంజీవితోనే సినిమాలు చేసేవారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలతో సినిమాలు నిర్మించారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే కొంతమంది బయట హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు అల్లు అరవింద్. ఈ క్రమంలోనే బాలయ్యతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ప్రస్తుతం బాలయ్య క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 వ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: