నాచురల్ స్టార్ నాని కెరియర్ లో ఎంతో ప్రత్యేకంగా చేసిన సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమా థియేట్రికల్ రన్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగగా లేటెస్ట్ గా జనవరి 21 నుండి శ్యామ్ సింగ రాయ్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీలో చూసిన ప్రేక్షకులు కూడా మంచి సినిమాని థియేటర్ లో చూడకుండా మిస్ అయ్యామని అనుకుంటున్నారు. ఇదిలాఉంటే శ్యామ్ సింగ రాయ్ సినిమా నుండి లేటెస్ట్ గా ఓ డిలీటెడ్ సీన్ ఆ సినిమా బ్యానర్ నిహారిక ఎంటర్టైన్మెంట్ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేశారు. వేశ్యలతో శ్యామ్ సింగ రాయ్ మాట్లాడే ఆ సీన్ లో తను రాసిన ఒక మాట వాళ్లకి వినిపిస్తాడు శ్యామ్ సింగ రాయ్.

అప్పుడు అందులో ఉన్న ఒక ఆమె ఇంత తెలిసిన నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటుంది. దానికి శ్యామ్ సింగ రాయ్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా చేసుకుంటా కానీ నాకు నీ మీద ప్రేమ కలిగినప్పుడు అని అంటాడు. శ్యామ్ సింగ రాయ్ అంటే ఏంటో చెప్పే ఈ డైలాగ్ సినిమాలో ఎందుకు తీసేశారో కానీ సినిమాలో ఉంటే శ్యామ్ సింగ రాయ్ కు మరింత ప్లస్ అయ్యేందని అంటున్నారు. అయితే సినిమా రన్ టైం ఎక్కువైందనే ఉద్దేశంతోనే శ్యామ్ సింగ రాయ్ లో చాలా సీన్స్ డిలీట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే డిలీట్ అయిన సీన్స్ ఇలా యూట్యూబ్ లో రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ చేస్తున్నారు నిహారిక బ్యానర్.

నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కృతి శెట్టి, సాయి పల్లవిల నటన గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకునేలా ఉంటుంది. కృతి శెట్టి ఫుల్ మోడ్రెన్ లుక్ తో ఆకట్టుకోగా రోజీ పాత్రలో సాయి పల్లవి మరోసారి కొన్నాళ్లు నిలిచిపోయే పాత్రని చేసింది. సినిమాలో శ్యామ్ సింగ రాయ్, రోజీల పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు.. మాటలు చాలా పొయెటిక్ గా ఓ అద్భుతాన్ని చేస్తాయి. థియేటర్ లో శ్యామ్ సింగ రాయ్ సినిమా మిస్సైన వారు కాస్త ఓటీటీలో సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ అనుకున్న విధంగా సక్సెస్ అయినందుకు నాని సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: