సూపర్ స్టార్ మహేష్ హీరోగా 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై ప్రస్తుతం తెరకెక్కుతున్న తాజా సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ దాదాపుగా రెండేళ్ల నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యువ సంగీత సెన్సేషన్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల చాలావరకు షూటింగ్ జరుపుకున్న సర్కారు వారి పాట లేటెస్ట్ షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా మహేష్ కి కోరనా సోకడంతో పాటు ఆయన సోదరుడు రమేష్ బాబు హఠాత్తుగా మరణించడంతో బాధల్లో ఉన్న మహేష్ ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేని యూనిట్ కొన్నాళ్లపాటు షూట్ ని వాయిదా వేసినట్లు టాక్. అందుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి మధ్యలో ప్రారంభం కానుందట. అయితే విషయంలోకి వెళితే, మరోవైపు సర్కారు వారి పాట సాంగ్స్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కి ఫస్ట్ సాంగ్ ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల తెలిపారు సంగీత దర్శకుడు థమన్.

ఇది మాత్రమే కాక ఇటీవల బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి స్పెషల్ గెస్ట్ గా మహేష్ విచ్చేసిన ఎపిసోడ్ ని ఫిబ్రవరి 4న ఆహా ఓటిటి లో ప్రసారం చేయనున్నారు. ఈ విధంగా మహేష్ ఫ్యాన్స్ కి రెండు గుడ్ న్యూస్ లభించగా, మరొక బాడ్ న్యూస్ కూడా ఉంది అని సమాచారం. ప్రస్తుతం లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 1న రిలీజ్ కావాల్సి సర్కారు వారి పాట మూవీ మరొక నెల వాయిదా పడి మే మొదటి వారంలో రానున్నట్లు టాక్. మరి ఇదే కనుక నిజం అయితే మహేష్ ఫ్యాన్స్ కి ఇది బాడ్ న్యూస్ అని అనే చెప్పాలి. మరి సర్కారు వారి పాట నిజంగానే మరొక నెల వాయిదా పడిందా లేదా తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: