తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు సంపత్ రాజ్. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఇక ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు ఆయన తప్ప మరొకరు సెట్ కారేమో అనేంతగా పాత్రలో ఒదిగిపోతూ ఉంటారు సంపత్ రాజ్. ముఖ్యంగా విలన్ పాత్ర లతో అయితే ప్రేక్షకులందరినీ కూడా భయ పెడుతూ ఉంటారు అని చెప్పాలి. ముఖ్యంగా కొరటాల శివ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మిర్చి సినిమాలో పగ తో రగిలి పోతున్న పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నాడు సంపత్ రాజ్.


 ఇక ఇటీవల కాలంలో ఏ సినిమాలో చూసినా సంపత్రాజ్ ఒక కీలక పాత్రలో కనిపిస్తూ ఉండటం గమనార్హం. హీరో హీరోయిన్లకు తండ్రులుగా మామ, అన్న లాంటి ఎన్నో పాత్రల్లో నటిస్తున్నారు ఆయన. ఇకపోతే ఇన్ని రోజుల వరకు విలన్ పాత్రలో నటించి బయటపెట్టిన సంపత్రాజ్... ఇప్పుడు ఐటం సాంగు చేయడానికి కూడా రెడీగా ఉన్నాను అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు. ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి విచ్చేశారు సంపత్ రాజు.  ఈ సందర్భంగా మిర్చి మిర్చి అనే పాట పై డాన్స్ చేశాడు. ఇక మీరు ఇలా డాన్స్ చేయడం ఎవరైనా చూసారు అంటే మీతో నెక్స్ట్ ఐటమ్ సాంగ్ చేయడానికి అందరూ రెడీ అయిపోతారు అంటూ వ్యాఖ్యాత అలీ అంటాడు.


 అయ్యో తప్పకుండా ఐటం సాంగ్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను అంటూ చెబుతాడు సంపత్ రాజ్. ఇక ఇక్కడ పర్ఫామెన్స్ చూసిన తర్వాత ఎవరైనా దర్శకుడు నాకు ఐటమ్ సాంగ్ నో ఛాన్స్ ఇస్తాడేమో నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పి నవ్వేసాడు సంపత్ రాజ్. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కాస్త ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే తన కెరియర్ కు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో  పంచుకున్నారు సంపత్ రాజ్. ఇండస్ట్రీ లోకి రావడానికి ముందు ఏం జరిగింది అనే విషయాలను కూడా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: