యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా పనులన్నీ ముగించుకున్నాడు,  ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతుండడంతో  ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది. అయితే కొన్ని రోజుల క్రితమే ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చి 18 వ తేదీన గాని లేక ఏప్రిల్ 28 వ తేదీన గాని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఆఫీషియల్ గా ప్రకటించింది, ఆర్ఆర్ఆర్ పనులన్నీ ముగించుకున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా దేశంలో కరోనా ప్రభావం ఈ సినిమా మరికొంత ఆలస్యం అయ్యేలా కనబడుతుంది. 

 అది మాత్రమే కాకుండా కొరటాల శివ కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు, దాదాపుగా ఆచార్య సినిమా కూడా ముగింపు దశకు రావడంతో మరికొన్ని రోజుల్లోనే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్సినిమా తర్వాత ఉప్పెన సినిమాతో మంచి విజయం అందుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక సినిమా నటించబోతున్నట్లు తెలుస్తోంది, వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని అనేక రోజులుగా వార్తలు వస్తున్నాయి, అయితే తాజాగా మరోసారి ఈ సినిమా పనులు వేగవంతం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, బుచ్చిబాబు  సన కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా కథ అంత విజయనగరం నేపథ్యంలో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి,  ఇంతవరకు ఎన్టీఆర్ తెరపై కనిపించిన పాత్రలకు ఈ పాత్రకు చాలా వ్యత్యాసం ఉండబోతున్నట్లు  తెలుస్తోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్, బుచ్చిబాబు సన సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: