యాంకర్ ప్రదీప్.. ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు.. రేడియో జాకీ గా ప్రెక్షకులకు దగ్గరైన ప్రదీప్ తర్వాత తన టాలెంట్ తో బుల్లితెర పై అడుగు పెట్టాడు. గడసరి అత్త సొగసరి కోడలు అనే షో జీ తెలుగులో ప్రసారం అయ్యింది. ఆ షో ద్వారా యాంకర్ గా పరిచయమాయ్యాడు. అలా క్రేజ్ ను సంపాదించుకొని ఇప్పుడు టాప్ మేల్ యాంకర్ గా దూసుకుపోతున్నాడు..సినీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో పాటు 'కొంచెం టచ్ లో ఉంటే చెప్తా' వంటి ప్రోగ్రామ్స్ తో ప్రదీప్ భారీ క్రేజ్ ను అందుకున్నాడు.


ప్రదీప్ కెరియర్ పరంగా బాగా సెటిల్ అయిన పెళ్ళి అనే మాటకు దూరంగా ఉన్నాడు. ఇది ఇలా ఉండగా త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.. ఈ కోవిడ్ పెరుగుతున్న నేపథ్యం లో చాలా మంది బ్యాచులర్స్ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. హీరోస్ అందరూ దాదాపుగా మ్యారేజ్ చేసుకున్నారు. ప్రభాస్ మినహా మిగతా హీరోలందరూ పెళ్లి చేసుకున్నారు. నితిన్, రానా దగ్గుబాటి, నిఖిల్ సిద్ధార్థ లు ఓ ఇంటి వాళ్ళు అయ్యారు.


ఇకపోతే ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు వంతు వచ్చింది. అతను గురించి సోషల్ మీడియా లో ఒక వార్త సంచలనంగా మారింది. రాయలసీమకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కూతురును పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.ప్రదీప్ తన పెళ్లికి సంబంధించిన ప్రకటనను అఫీషియల్ గా తానే ప్రకటిస్తారట.. గతంలో ఇతని పై చాలా రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త అన్నా నిజం అవుతుందేమో చూడాలి.. ప్రదీప్ ప్రస్తుతం పలు టీవీ షో లతో పాటు సినిమాలను కూడా చేస్తున్నాడు.మొత్తానికి త్వరలో ప్రదీప్ ఓ ఇంటివాడు కాబోతోన్నాడు..ఆ అమ్మాయి ఎవరో త్వరలోనే తెలుస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: