సినిమా ఇండస్ట్రీలో రూమర్లు అనేవి మాత్రం చాలా కామన్‌. అయితే ఇందులో నిజం ఎంత ఉందో.. అబద్దం ఎంత ఉందో అన్నది మాత్రం ఎవ్వరికి తెలియదు. మీడియా కావచ్చు అలాగే 
.సోషల్ మీడియా కావచ్చ ఎవరికి వారు తమ రేటింగ్‌లు మరియు వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు గాసిప్‌లు వండేస్తుంటారు. ఈ గాసిప్‌ల వల్ల ఒక్కోసారి సెలబ్రిటీలు తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక కొన్ని సినిమాల్లో హీరో, హీరోయిన్లు రిపీట్ అయినా అలాగే దర్శకులు - హీరోయిన్లు రిపీట్ అయినా కూడా వారి మధ్య ఏదో లింక్ ఉందన్న ప్రచారం ఎక్కువుగా నడుస్తూ ఉంటుంది.

టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 30 సినిమాల్లో నటించాడని అందరికి తెలుసు.తన తొలి సినిమా నిన్ను చూడాలని హీరోయిన్ రవీనా రాజ్‌పుత్‌తో మొదలు పెట్టి ఎంతో మంది హీరోయిన్లతో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేశాడు ఎన్టీఆర్ . అయితే తారక్ విషయంలో ఏ హీరోయిన్‌తో కూడా అస్సలు రూమర్లు స్ప్రెడ్ కాలేదు. ఈ విషయంలో తారక్ ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు.

అయితే ఓ హీరోయిన్ విషయంలో మాత్రం రూమర్లకు బలికాక తప్పలేదట.. ఆ హీరోయిన్ ఎవరో కాదు సమీరారెడ్డి అని తెలుస్తుంది.సమీరారెడ్డి బాలీవుడ్ హీరోయిన్ అయినా కూడా ఆమె తెలుగమ్మాయే. ఆమె స్వస్థలం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం అయితంపూడి. ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా ముంబైలో స్థిరపడడంతో సమీరా అక్కడే పెరిగి మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత హీరోయిన్ అయ్యిందిట.

ఆమె ఎన్టీఆర్‌తో నరసింహుడు మరియు అశోక్ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అశోక్ సినిమాలో ఎన్టీఆరే సిఫార్సు చేసి ఆమెకు ఛాన్స్ ఇప్పించాడన్న ప్రచారం బాగా జరిగింది.ఆ సినిమా టైంలోనే సమీరారెడ్డికి ఎన్టీఆర్ ఒక ఖరీదైన కారును కూడా బహుమతిగా ఇచ్చారని వార్తలు తెగ వినిపించాయి . అలా వీరిద్దరి మధ్య ఏదో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయట..

ఈ వార్తలు బాగా బయటకు రావడంతో స్పందించిన సమీరా ఎన్టీఆర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిందట.. ఆ తర్వాత ఆమె ఓ మోడల్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోందట సమీరా.

మరింత సమాచారం తెలుసుకోండి: