మొన్నటికి మొన్న ఒక స్టైలిష్ బైక్ పై యాంకర్ రవి తో కలిసి చిరిగిన జీన్స్ వేసుకుని ఎంతో హాట్గా కనిపించింది అషు రెడ్డి. ఇక కొన్నాళ్లపాటు దీని గురించి చర్చించుకున్నారు అభిమానులు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుందిఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఎప్పటిలాగానే ఈ అమ్మడు ఇటీవలే ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. కానీ ఈ ఫోటో తో నెటిజన్లు అందరికీ కూడా అడ్డంగా దొరికిపోయింది అషురెడ్డి. ఇంతకీ ఏం జరిగింది అని అనుకుంటున్నారు కదా.
అషు రెడ్డి ఇటీవలే కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో ఇక ఈ ఫోటోలలో తన కార్ నెంబర్ క్లియర్ గా కనిపించింది. ఇంకేముంది ఇదంతా జరిగిన తర్వాత నెటిజన్లు ఊరుకుంటారా.. ఎప్పుడూ సరికొత్త ఆలోచనలతో తమ మైండ్ పని చెప్పే నెటిజన్లు.. ఇక ఇప్పుడు కూడా కాస్త కొత్తగా ట్రై చేశారు. అషు రెడ్డి కార్ నెంబర్ మీద ఆన్లైన్లో చలాన్లు ఎన్ని ఉన్నాయో చెక్ చేసారూ. కాగా 2305 రూపాయల పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అషురెడ్డిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.. ముందు పెండింగ్లో ఉండగా చలాన్లు కట్టాలి మేడం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇలా అంటారు అని తెలిసుంటే అషు రెడ్డి తన కారు నెంబర్ ను కవర్ చేస్తూ ఫొటో దిగేదేమో పాపం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి