ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా నుండి మొదటి పాట విడుదల చేయక ముందే మొత్తం పాట కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకమైన విషయం తెలిసిందే. ఆ విషయమై సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా షాక్ అయింది. ఇదే సమయంలో రామ్ చరణ్ మరి శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన ఫోటోలు మరియు ఇతర విషయాలు లీక్ అవ్వడం చాలా ఇబ్బందిగా మారింది. నిర్మాత దిల్ రాజు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ సినిమాకు సంబంధించిన లీకులు ఆ మాత్రం ఆగడం లేదట..
ఇటీవలే ప్రెస్ నోట్ విడుదల చేసి మరీ వార్నింగ్ ఇవ్వడం.. విజ్ఞప్తి చేయడం చేశారట.. అయినా కూడా లీక్ జరుగుతూనే ఉందని తెలుస్తుంది.. సినిమా యూనిట్ సభ్యుల్లో కొందరు సినిమాలోని రామ్ చరణ్ మరియు ఇతర కీలక విషయాలకు సంబంధించి లీక్ చేస్తూనే ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. దిల్ రాజు ఎంతగా విజ్ఞప్తి చేసినా.. ఎంత వార్నింగ్ ఇచ్చిన కూడా వారికి బుద్ధి లేకుండా వారు లీక్ లకు పాల్పడుతూనే ఉన్నారు.
ఈ విషయంలో దిల్ రాజు ఇకపై మరింత సీరియస్ గా వ్యవహరించాల్సి ఉంటుంది ఏమో మరి. రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ లు జంటగా నటించిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడని అందరికి తెలిసిందే.. అంజలి కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాలో భారీ ఎత్తున గ్రాఫిక్స్ మాత్రం ఉండవు కానీ యాక్షన్ సన్నివేశాలు మరియు పాటలకు సంబంధించిన ఎలిమెంట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని మేకర్ చెప్తున్నారు. ఆ విషయాలు ఏవీ బయటకు రాకుండా చూసుకోవాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు చూడాలి ఇకపై అయన లీక్ కాకుండా ఉంటుందేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి