టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సం హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.'ఆర్ఎక్స్100' లాంటి యూత్ ఫుల్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ సినిమాతో హీరోగా మంచి హిట్ అందుకున్నాడు కార్తికేయ. ఆ సినిమాలో కార్తికేయ యాక్టింగ్ ఇంకా పాయల్ రాజ్ పుత్ గ్లామర్ అండ్ బోల్డ్ నెస్ కి ఇంకా వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ సీన్లకు యూత్ బాగా కనెక్ట్ అయిపోయి ఈ సినిమాకి బ్రహ్మ రధం పట్టడం అనేది జరిగింది. ఇక ఈ సినిమా తరువాత కార్తికేయకి చాలా ఛాన్సెస్ అనేవి వచ్చాయి. హీరోగా, విలన్ గా కూడా కార్తికేయ సినిమాలు చేస్తున్నాడు.కానీ ఏదీ కూడా అతనికి సరైన క్రెడిట్ ను తీసుకురాలేదు. అతని పెర్ఫార్మన్స్ కి అయితే మంచి మార్కులు పడుతున్నప్పటికీ.. స్టార్ ఇమేజ్ మాత్రం అసలు అందుకోలేకపోతున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'గ్యాంగ్ లీడర్' సినిమా కూడా ఇతనికి నిరాశనే మిగిల్చింది.


ఇక ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ యంగ్ హీరో కోలీవుడ్ లో  స్టార్ హీరో అజిత్ నటించిన 'వలిమై' సినిమాలో ముఖ్యమైన రోల్ ని పోషించాడు.ఈ సినిమాపై అతను చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా గురించి ఇంకా అలాగే తన పాత్ర గురించి చాలా గొప్పగా చెబుతూ వచ్చాడు కార్తికేయ. కానీ చివరికి ఈ సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ మాత్రం నిట్టూరుస్తున్నారు. కార్తికేయ ఎగ్జైట్ అయినంతగా ఈ సినిమాలో ఏముందంటూ ప్రశ్నిస్తూ ఫలితాన్ని తేల్చేస్తున్నారు. తెలుగులో ఇలాంటి సినిమాలు ఇంకా ఇలాంటి పాత్రలు బోలెడు చూశామని కామెంట్స్ చేస్తున్నారు. మన వాళ్లకు ఈ సినిమా పెద్దగా కిక్ ని ఇవ్వలేకపోయింది.అయితే ఈ సినిమా కోసం పాపం మన హీరో కార్తికేయ చాలా కష్టపడ్డాడు. అతడికి మామూలుగానే తన బాడీ అనేది ఒక ప్లస్ పాయింట్.


సినిమా కోసం మరింతగా తన ఫిజిక్ పెంచాడు. ప్రతి సీన్ లో తన ఫిజిక్ తో, స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నారు. కార్తికేయ రోల్ కాస్త డల్ గా ఉన్నప్పటికీ.. తన పాత్రను హైలైట్ చేయడానికి మాత్రం పాపం బాగానే కష్టపడ్డాడు. కొన్ని చోట్ల అజిత్ కుమార్ ని కూడా కార్తికేయ డామినేట్ చేశాడు.కానీ ఇంత కష్టపడినప్పటికీ అతడి రోల్ మాత్రం అనుకున్నంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. దీంతో కార్తికేయ తనకు వున్న పరువు కూడా పోగొట్టుకున్నట్లయింది.అజిత్ కుమార్ స్టార్ హీరో కావడంతో అతనిని హైలైట్ చేయాలనే ఎయిమ్ తో కార్తికేయ పాత్రను తక్కువగా రాసుకున్నాడు డైరెక్టర్. అందువల్ల పాపం కార్తికేయకు క్రెడిట్ కొంచెం కూడా రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: