ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా సాధ్యం కాని రీతిలో ఫస్ట్ డే కలెక్షన్స్ భీమ్లా నాయక్ సినిమా కి వచ్చాయి.. పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో డైలాగులు మాత్రం త్రివిక్రమ్ రాయడంతో ఇక ఈ సినిమా పై మరింత హైప్ పెరిగిపోయింది. ముఖ్యంగా రానా పవన్ కళ్యాణ్ మధ్య ఉండే సన్నివేశాల్లోనీ డైలాగులు ప్రేక్షకులు అందరికి గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ నటించగా రానా సరసన సంయుక్త మేనన్ నటించింది.
ఇందులో నిత్యామీనన్ పాత్రకి మంచి స్కోప్ ఉంది. కానీ సంయుక్త మీనన్ పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అయితే రానా భార్యగా సంయుక్త మీనన్ కు బదులు మొదట అనుకుంది నాచురల్ బ్యూటీ సాయి పల్లవి నట. కానీ ఇక సంయుక్త మీనాన్ నటించిన పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోవడంతో రిజెక్ట్ చేసిందట సాయి పల్లవి. పవన్ సినిమాను సాయిపల్లవి రిజెక్ట్ చేసింది అంటూ అప్పట్లో వార్తలు రాగా పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇటీవల సినిమా విడుదలైన తర్వాత ఆ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు అని తెలిసి సాయి పల్లవి వదులుకొని మంచి పని చేసింది అని కొంతమంది అనుకుంటున్నారట..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి