ప్రముఖ హాస్య నటుడు అయిన బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కొన్ని సినిమాలతో హీరోగా ఆకట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి కాస్త నిరుత్సాహాన్ని అందించాయి.. అయితే కాస్త విరామం తర్వాత ఇప్పుడు సరికొత్త ప్రాజెక్టుతో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాడు బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్. ఈ సందర్భంగా తను నటిస్తున్న చిత్రానికి సంబంధించి ఒక ఈ వీడియో గ్లింప్స్ కూడా మేకర్స్ నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది.


ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్ ప్రొడక్షన్ నెంబర్-10 గా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతోనే సుబ్బు చేకూరి డైరెక్టర్ గా తొలి పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి నిన్నటి రోజున ఒక గ్లింప్స్ విడుదల చేయగా అది బాగా ఆకట్టుకుంది. ఆ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఒంటరితనం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అనే డైలాగ్ నుంచి ఈ  గ్లింప్స్ ప్రారంభమవుతుంది.. ఇక ఇందులో గౌతమ్ లుక్ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈసారి ఒక విభిన్నమైన సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించేందుకు శ్రీకారం చుట్టినట్లుగా కనిపిస్తోంది. అంతే కాకుండా ఇందులో మోనో ఫోబియాతో బాధపడుతున్న ఒక రచయితగా ఈ చిత్రంలో గౌతమ్ కనిపించనున్నారు.


ఇక తన జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలను ఎలా ఎదుర్కొంటాడో... అన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందట. ఇక ఈ సినిమా చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది అంటూ చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చివరి దశలో ఉన్నది. ఈ చిత్రానికి మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అయితే ఈ సారైనా హీరో రాజా గౌతమ్ ను ఈ సినిమా అయినా సక్సెస్ బాట పట్టిస్తుందేమో చూడాలి మరీ. ఏది ఏమైనా తన సినీ కెరీర్ లో ఎన్ని డిజాస్టర్ లు వచ్చినా కూడా తిరిగి ప్రయత్నిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: