‘రాథే శ్యామ్’ విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆనందం కంటే టెన్షన్ పెరిగిపోతోంది అన్నమాటలు వినిపిస్తున్నాయి. దీనికికారణం ఇప్పటివరకు విడుదలై అఖండ విజయం సాధించిన ‘అఖండ’ ‘పుష్ప’ ‘భీమ్లా నాయక్’ సినిమాలులా ‘రాథే శ్యామ్’ హై యాక్షన్ ఒల్టేజ్ మూవీ కాదు. ఈమూవీ కథ అంతా విధికి ప్రేమకు మధ్య జరిగే పోరాటం.


మనిషి జీవితాన్ని విధి ఎలా శాసిస్తుందో చెప్పే సన్నివేశాల చుట్టూ ఈమూవీ కథ తిరుగుతుంది. ఈమూవీలో ఒక్క ఫైట్ సీన్ కూడ ఉండడు అన్నవిషయం ఇప్పటికే ఈ మూవీ దర్శక నిర్మాతలు లీకులు ఇస్తూ ప్రేక్షకులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఈమూవీలో ‘విధి’ మాత్రమే విలన్. ఇలాంటి కథలు 1980 ప్రాంతాలలో చాల వచ్చి ఘనవిజయం సాధించాయి.


అయితే ఇప్పుడు సగటు ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది. తాము చూసే సినిమాలో ఊహకందని ట్విస్టులతో పాటు చాల హై యాక్షన్ సీన్స్ ను కోరుకుంటున్నారు. అలాంటి మాస్ మసాల సీన్స్ ‘రాథే శ్యామ్’ లో అసలు ఉండే అవకాశాలు లేవు. దీనికితోడు ఈమూవీలోని పాటలు అన్నీ ఉత్తరాది స్టైల్ లో హిందీ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చే విధంగా ట్యూన్ చేయించారు. దీనితో ఇలాంటి కథ తెలుగు రాష్ట్రాలలోని సగటు ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుంది అన్న భయాలు ప్రభాస్ అభిమానులను వెంటాడుతున్నట్లు టాక్.


‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ ఇమేజ్ ప్రభాస్ అందుకున్నప్పటికీ ఆతరువాత విడుదలైన ‘సాహో’ ఘోర పరాజయం చెందడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీనితో విడుదల కాబోతున్న ‘రాథే శ్యామ్’ బ్లాక్ బష్టర్ హిట్ సాధించవలసిన పరిస్థితి. ఇప్పుడు ఆ స్థాయి విజయాన్ని ఈమూవీ అందుకోకపోతే ప్రభాస్ మార్కెట్ పరిస్థితి ఏమిటి అంటూ అభిమానులు తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు టాక్. దీనికితోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ షోలు బెనిఫిట్ షోల విషయంలో అనుసరించే విధానాలు కూడ ఈమూవీ కలక్షన్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: