‘రాథే శ్యామ్’ ఫ్లాప్ ఫలితాన్ని ఇప్పటికీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. పాన్ ఇండియా హీరో స్థాయికి ఎదిగిన ప్రభాస్ కు అతడి స్థాయికి తగ్గ సినిమాలు రావడం లేదని అభిమానుల ఆవేదన. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఒక న్యూస్ అభిమానులను మరింత కలవరపెడుతోంది.


హడావిడి చేస్తున్న ఆవార్తల ప్రకారం ప్రభాస్ చాల రహస్యంగా స్పెయిన్ వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ప్రభాస్ స్పెయిన్ ఎందుకు వెళ్ళాడు అంటూ చర్చ మొదలైంది. వాస్తవానికి ప్రభాస్ నటిస్తున్న సినిమాల షూటింగ్ లు ఏమీ స్పెయిన్ లో జరగడంలేదు. దీనితో ప్రభాస్ ఇంత హడావిడిగా స్పెయిన్ ఎందుకు వెళ్ళాడు అంటూ సాగే ఆలోచనల మధ్య రకరకాల వార్తల హడావిడి మొదలైంది.



ఈవార్తల మధ్య ప్రభాస్ తన సర్జరీ కోసం స్పైన్ వెళ్ళాడు అంటూ వచ్చిన కొన్ని వార్తలు మరింత ఖంగారు అభిమానులలో కలిగించాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి వర్గాలలో కొనసాగుతున్న గాసిప్పుల ప్రకారం ‘కేజీ ఎఫ్ 2’ షూటింగ్ లో ప్రభాస్ కు చిన్న గాయం అయిందని అయితే ఆ విషయాన్ని ప్రభాస్ అశ్రద్ధ చేయడంతో ఇప్పుడు అతడికి అనారోగ్య సమస్యగా మారడంతో ప్రభాస్ అశ్రద్ధ చేయకుండా స్పెయిన్ లోని బార్సీలోనా కు వెళ్ళి సర్జరీ చేయించుకోబోతున్నట్లు టాక్.


ఈ సర్జరీ తరువాత ప్రభాస్ స్పెయిన్ లోని రెండు వారాలు ఉంటాడట. ఆతరువాత ఇండియాకు తిరిగివచ్చి తన ‘సలార్’ షూటింగ్ కు పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ఈ వార్తల ఇలా కొనసాగుతుంటే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక థ్రిల్లర్ మూవీని చేయబోతున్నాడు అని వస్తున్న వార్తలు విని అభిమానులు మరింత ఖంగారు పడుతున్నారు. ఇండస్ట్రీలో టాప్ దర్శకులు ఎంతోమంది ఉండగా ప్రభాస్ మారుతి లాంటి మిడిల్ రేంజ్ దర్శకుడుకి అవకాశం ఎలా ఇచ్చాడు అంటూ మరింత గందరగోళానికి గురవుతున్నారు. ప్రభాస్ సినిమాల ఎంపిక లైనప్ లోని పొరపాటు ఉందా అన్న చర్చలు మొదలయ్యాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: