ఒక సినిమా విడుదల అయ్యింది అంటే అందులో నటించిన వాళ్ళ గురించి చెప్పడం, సినిమా కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో అన్న విషయం గురించి అందరికి చెబుతారు..ఆ సన్నీవేశాలు సినిమాకు హైలెట్ అవుతాయి. అందులో అంతగా వాళ్ళు ఎం చేసారో అనే విషయం కోసం ఆసక్థిగా ఎదురు చూస్తూ సినిమాను చూస్తారు. కొంత మంది చేసిన చేసిన సాహాసాలను చూసి వారెవ్వా అంటే, మరి కొంతమంది అందులొ ఏముంది అని అనుకుంటారు.. ఇప్పుడు వస్తున్న సినిమాల పరిస్థితి ఇలానే వుంది.


ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు క్రేజీ స్టార్ హీరో యశ్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కేజీఎఫ్‌ చాప్టర్‌-2..కేజీఎఫ్‌.. సినిమా కు వచ్చిన క్రేజ్ కారణంగా ఇప్పుడు సీక్వెల్ గా మరో సినిమాను తెరకెక్కించారు... ఆ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తీ చేసుకుంది. సినిమా విడుదల పై ఆసక్తి నెలకొంది.గతం లో వచ్చిన సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా రాబట్టడంతో ఇప్పుడు వస్తున్న సినిమా పై కూడా భారీ అంచనలు ఏర్పడ్డాయి.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తీ చేసుకుంది. కాగా, ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ ను లాంచ్ చేశారు..


ఆదివారం రాత్రి బెంగళూరులో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ను గ్రాండ్ గా ప్లాను చేశారు.. ఆ ఈవెంట్ లో ట్రైలర్ ను లాంచ్ చేశారు.. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా హీరో యశ్‌ మాట్లాడారు.. అందులో భాగంగా సంజయ్‌దత్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. అనార్యోగం నుంచి కోలుకుని కూడా ఆయన సెట్‌లో డెడికేషన్‌తో వర్క్‌ చేశారు. పనిపట్ల ఆయనకు ఉన్న నిబద్ధతే ఆయన్ని ఆ స్థాయిలో ఉంచింది అంటూ హీరో అన్నారు.సినిమా మొదలైన కొద్ది రోజుల్లోనే ఆయన తీవ్ర అనారోగ్యం కారణంగా భాధ పడ్డారు.అందరు కూడా అదే ఆలోచనలో ఉండటం ఆయన అవమానంగా ఫీల్ అయ్యారు. దాంతో నా గురించి ఆలొచించకండి అంటూ ధైర్యం చెప్పాడు.. తర్వాత కోలుకొని సినిమా చేశారు.. అంటూ ఆయనను అభినందించారు..మొత్తానికి హీరో మాటలు ఈవెంట్ కు హైలెట్ అయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: