అయితే తాజాగా అనంతపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ నేను అద్భుతాలు చేస్తానని ఏ రోజు కూడా చెప్పను. ఇక ఆత్మహత్య చేసుకోవాలని ఏ పరిస్థితుల్లో ఆలోచిస్తారు నాకు బాగా తెలుసు అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు కారణం ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఇంటర్ చదివే సమయంలో సరిగ్గా చదువుకోవట్లేదు అని బాధతో ఆత్మహత్య చేసుకుంటే మంచిది అని ఆలోచించటం అదృష్టం కొద్దీ తన సోదరుడు నాగబాబు, అలాగే తన వదిన పక్కన ఉండి మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పారు అని, అలా ఆరోజు ఆత్మహత్యను విరమించుకున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో కూడా తనకు తెలుసునని ఓట్లకోసం సహాయం చేయడం లేదు.. అని మానవత్వంతో సహాయం చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇకపోతే 2024లో జరిగే ఎన్నికలలో జనసేన పార్టీ టిడిపి తో కలసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యేవిధంగా కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి