అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ బ్లాక్ బష్టర్ హిట్ అయినప్పటికీ ఆమూవీ బయ్యర్లకు చాల చోట్ల కొద్దిపాటి లాభాలు మాత్రమే వచ్చాయని మరి కొన్ని చోట్ల అయితే ఆమూవీ బయ్యర్లు కేవలం బ్రేక్ ఈవెన్ మాత్రమే అయ్యారని అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.
వాస్తవానికి ఈ మూవీ విడుదల ముందు ఏర్పడిన భారీ క్రేజ్ కు తగ్గట్టుగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి టిక్కెట్ల రేట్ల విషయంలో చాల పెద్ద మనసుతో సహకరించారు కాబట్టి ఆ స్థాయిలో ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఘన విజయం వచ్చింది కానీ లేదంటే ఈమూవీకి వచ్చిన కొంత డివైడ్ టాక్ వల్ల ఆమూవీ బయ్యర్లు చాల నష్టపోయి ఉండేవారు అన్న వాదన కూడ ఉంది.
ఈ మూవీ అంత ఘనవిజయం సాధించినప్పటికీ ఆమూవీ సక్సస్ మీట్ ను భాగ్యనగరంలో నిర్వహించలేదు అన్న సందేహం ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితుల మధ్య రాజమౌళి మహేష్ తో తీయబోయే మూవీ బడ్జెట్ గురించి కూడ అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు రాజమౌళికి సంబంధించి ఒక షాకింగ్ గాసిప్ ఇప్పుడు మీడియా వర్గాలలో బాగా ప్రచారంలో ఉంది. సందడి చేస్తున్న ఈ లీకుల ప్రకారం రాజమౌళి మహేష్ తో తీయబోయే సినిమా ప్రారంభం అయ్యేలోపు ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీని తీయాలని జక్కన్న ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దీనికి సంబంధించి రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ తో కథకు సంబంధించి ఆలోచనలు కూడ చేస్తున్నట్లు టాక్. ఆ వార్తలే నిజం అయితే రాజమౌళి తీయబోయే ఆ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో ఎవరు నటిస్తారు అంటూ అప్పుడే ఊహాగానాలు కూడా మొదలై పోయాయి. ఈసినిమాను రాజమౌళి చాల వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసి ఆతరువాత మహేష్ సినిమా వైపు వెళ్తాడని ప్రచారం జరుగుతోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి