‘రాథే శ్యామ్’ పరాజయం చెందడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ మూవీ విడుదల వరకు ప్రభాస్ అభిమానులు వేచి చూడవలసిన పరిస్థితి. దీనికితోడు శ్రీరాముడు గా ప్రభాస్ ను ఎంతవరకు తెలుగు ప్రేక్షకులు అంగీకరిస్తారు అన్నసందేహాలు కూడ ప్రభాస్ అభిమానులను వెంటాడుతున్నాయి.


దీనికితోడు ప్రభాస్ నీల్ కమల్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘సలార్’ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈమధ్య ప్రభాస్ కు సర్జరీ జరగడంతో ఈమూవీ షూటింగ్ మళ్ళీ మొదలై పూర్తి కావడానికి చాల సమయం పట్టి ఈమూవీ వచ్చే ఏడాది సమ్మర్ కు మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో మారుతి సన్నిహిత వర్గాల ద్వారా మీడియాకు లీక్ అవుతున్న ఒక న్యూస్ ప్రభాస్ అభిమానులను మంచి జోష్ లో ముంచెత్తి వేస్తోంది.


హడావిడి చేస్తున్న ఈ వార్తల ప్రకారం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే మూవీ జూన్ లో మొదలై కేవలం మూడే మూడు నెలలలో పూర్తి చేయడానికి మారుతి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల ఇన్ సైడ్ టాక్. అంతేకాదు ఈమూవీలో ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని అనే ప్రచారం కూడ జరుగుతోంది. హారర్ కామెడీ జోనర్ లో నిర్మించబోయే ఈమూవీలో ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ చూస్తారని అంటున్నారు.


అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసి ‘రాథే శ్యామ్’ తో అభిమానులలో ఏర్పడిన అసంతృప్తిని తొలగించి ఒక మంచి హిట్ ప్రభాస్ కు ఇచ్చి ఈ సంవత్సరానికి విజయంతో గుడ్ బై చెప్పాలని మారుతి ప్లాన్ అంటున్నారు. అయితే ఈమధ్య కాలంలో భారీ యాక్షన్ సినిమాలకు అలవాటు పడిపోయిన ప్రభాస్ కామెడీ సీన్స్ లో ఎలా నటించి మెప్పించగలడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: