చిరంజీవి రామ్ చరణ్ లు కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీ ప్రమోషన్ ప్రారంభం అయింది. ఈమూవీలో అనేకవిషయాలు ఉన్నప్పటికీ ‘ఆచార్య’ ప్రచారం అంతా చిరంజీవి చరణ్ లు కలిసి డాన్స్ చేసిన బంజారా పాటను హైలెట్స్ చేస్తున్నారు. ఈ పాట షూటింగ్ సమయంలో చరణ్ కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు అంతా వచ్చి ఆపాటను షూట్ చేస్తున్న సమయంలో చరణ్ చిరంజీవి లు కలిసి వేసిన స్టెప్స్ ను ఏవిధంగా ఎంజాయ్ చేసారు అన్నవిషయాలు హైలెట్ చేస్తున్నారు.



అదేవిధంగా ఈమూవీ మారేడుమిల్లి షూటింగ్ సమయంలో చరణ్ జూనియర్ లు ఎలా అన్నదమ్ములు లా కలిసి భోజనం చేయడం ఒకరిపై ఒకరు జోక్ చేసుకున్న విషయాలను హైలెట్ చేస్తున్నారు తప్ప అసలు ఆసినిమా కథ గురించి పెద్దగా చెప్పడం లేదు. సాధారణంగా కొరటాల సినిమాలలో సామాజిక స్పృహ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆవిషయాలను గురించి ఎక్కువగా చెప్పకుండా చిరంజీవి చరణ్ లు కలిసి అద్భుతంగా డాన్స్ చేసారు అంటూ ‘ఆచార్య ప్రమోషన్ అంతా ఆ పాట చుట్టూనే తిరగడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.


మరికొందరైతే ఇండస్ట్రీలో తండ్రి కొడుకులు ఒక పాటలో నటించిన సందర్భాలు చాల ఉన్నాయని ముఖ్యంగా నాగార్జున అక్కినేని నాగేశ్వరావు కలిసి నటించిన సినిమాలలో ఒకే పాటలో కలిసి నటించిన సందర్భాలు ఉన్నాయి అంటూ గత సినిమాలను గుర్తు చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ‘ఆచార్య’ మూవీ విడుదల ఇక వారం రోజులు మాత్రమే ఉన్నప్పటికీ ఈసినిమాకు ఇప్పటివరకు రావలసినంత అద్భుతమైన క్రేజ్ ఏర్పడలేదు అన్న వాదన కూడ ఉంది.



ఈసినిమాకు భారీ సంఖ్యలో మెగా ఫ్యాన్స్ వస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సగటు ప్రేక్షకుడు ఎంతవరకు చిరంజీవి చరణ్ లు కలిసి నటించిన సందర్భాన్ని గ్రహించి ధియేటర్లకు వేలంవెర్రిగా వస్తారు అన్న విషయంలో మరికొందరికి సందేహాలు ఉన్నాయి. మరికొందరైతే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని ‘నాటునాటు’ ను ‘ఆచార్య’ లోని ‘బంజారా’ పాటను పోలుస్తూ నాటునాటు పాట ముందు చరణ్ చిరంజీవి లు చేసిన ‘బంజారా’ పాట తేలిపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: