వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా,  మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్ 3 సినిమా తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే. ఎఫ్ 3 సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండడానికి ప్రధాన కారణం ఎఫ్ 2 సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడమే. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఎఫ్ 3 సినిమా ఈ నెల 27 వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేసింది.  

అందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి చిత్ర బృందం 'వూ ఆ ఆహా ఆహా' అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ లో లో తమన్నా, మెహరీన్ తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు. అలాగే ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సాంగ్ విడుదలైన అతి తక్కువ సమయం లోనే యూట్యూబ్ లో అదిరిపోయే న్యూస్ ను సాధించింది.

ప్రస్తుతం కూడా ఈ  సాంగ్ యూట్యూబ్ లో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతోంది. 'వూ ఆ ఆహా ఆహా' లిరికల్ వీడియో సాంగ్ విడుదలైన ఇరవై రెండు గంటలకు పదిహేను లక్షల వ్యూస్ ను, 63 కే లైక్ లను సాధించింది. ఎఫ్ 3 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఎఫ్ 3 సినిమాను అనిల్ రావిపూడి డబ్బు సమస్యలు చుట్టూ ఏర్పడే కామెడీ ద్వారా తెరకెక్కించినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి ఎఫ్ 3 మూవీ ఎఫ్ 2 రేంజ్ లో  ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో,  లేక అంతకంటే ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: