‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలై నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదవ వారంలోకి అడుగుపెట్టింది. ఈమూవీ 13వందల కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూలు చేసింది అంటూ యూనిట్ వర్గాల నుండి లీకులు వస్తున్నాయి. ఈమూవీని చైనా జపాన్ భాషలలో డబ్ చేసి ఈ సంవత్సరం అక్టోబర్ లో విడుదల చేసి అక్కడితో ఈమూవీకి ఏదోవిధంగా 2వేల కోట్ల టార్గెట్ రీచ్ అయింది అన్నప్రచారం చేయాలని రాజమౌళి పక్కా వ్యూహంతో ఉన్నాడు.


ఈసినిమా విడుదలై నాలుగు వారాలు దాటిపోయినా ఇప్పటికీ జూనియర్ అభిమానులకు రాజమౌళి పై ఏర్పడిన కోపం తగ్గలేదు. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీకి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు లీక్ కావడంతో తారక్ అభిమానులు రాజమౌళి పై మరింత కోపంగా ఉన్నారు. తారక్ ను చరణ్ కట్టేసి కొట్టిన తర్వాత జైల్లో వేసిన సమయంలో ఒక అద్బుతమైన సన్నివేశం ఎన్టీఆర్ కు ఉంటుందట ఆ సన్నివేశంను ఎడిటింగ్ లో తీసేశారు అన్న లీకులు వస్తున్నాయి.


ఆ సన్నివేశం కనుక పెట్టి ఉంటే ఎన్టీఆర్ స్టామినా ఏమిటో మరింతగా ప్రతి ఒక్కరికి తెలిసేది అన్నది తారక్ అభిమానుల వాదన.
ఇప్పటికే ఎన్టీఆర్ కు ఈమూవీలో సరైన ఎలివేషన్ సన్నివేశాలు పడలేదు అన్న ఫీలింగ్ లో తారక్ అభిమానులు ఉన్నారు. ఇలాంటి సమయంలో తారక్ నట విశ్వరూపం కనిపించే సన్నివేశాలను ఎడిటింగ్ లో లేపాల్సిన అవసరం ఏమిటీ అంటూ జూనియర్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు.


వాస్తవానికి జూనియర్ ను రాజమౌళి తన ఇంటి కుటుంబ సభ్యుడులా భావిస్తాడు. రాజమౌళి కొడుకు కార్తికేయ తారక్ ను ‘అన్నా’ అంటూ చాల అభిమానంగా పిలుస్తాడు. ఇలాంటి నేపధ్యంలో ‘ఆర్ ఆర్ ఆర్’ లో జూనియర్ పాత్రకు సంబంధించి అతడికి ఎందుకు అన్యాయం జరిగింది అంటూ ఇప్పటికీ ఆవిషయాన్ని అభిమానులు మరిచిపోలేక రగిలిపోతున్నారు. ఈప్రశ్నల పరంపర జక్కన్న దృష్టి వరకు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనపడుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: