ఈ మూవీ నిర్మాతలు చేసిన అభ్యర్థనలతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ‘ఆచార్య’ టిక్కెట్ల రేట్ల పెంపుదలకు అంగీకరించాయి. ఆ నిర్ణయం వచ్చిన వెంటనే పెద్ద హీరోల సినిమాలు ప్రేక్షకులను దోచేసుకుంటున్నాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ఈ విషయాలను అన్నీ చిరంజీవి దృష్టి వరకు వెళ్ళడంతో చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి కొరటాల రామ్ చరణ్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిరంజీవి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.
‘ఆచార్య’ విడుదల ఆలస్యం కావడంతో 50 కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లించామని చిరంజీవి ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. అంతేకాదు ఈ మూవీ దర్శకుడు కొరటాల చరణ్ తాను ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడ పారితోషికం కూడ తీసుకోలేదని చిరంజీవి అంటున్నాడు. ‘ఆచార్య’ కు కట్టిన వడ్డీలతో ఒక మీడియం రేంజ్ సినిమాను తీయవచ్చని చిరంజీవి అంటున్నాడు.
ప్రజలకు వినోదం అందించాలి అని తామంతా కష్టపడుతూ ఉంటే టాప్ హీరోల సినిమాల టిక్కెట్ల రేట్లు వలన ప్రేక్షకులు నష్టపోతున్నారు అంటూ వార్తలు వ్రాయడం ఎంతవరకు సమంజసం అంటూ చిరంజీవి అసహనానికి లోనయ్యాడు. తమ భారీ సినిమాలకు ప్రభుత్వాలు కనికరించి జీవొ ఇస్తే ప్రేక్షకులు కూడ తమ పై కరుణించి టిక్కెట్ల ధర ఎంత ఉన్నా పట్టించుకోకుండా ముందుకు వస్తున్నారనీ తాము టిక్కెట్ల రూపంలో వచ్చిన డబ్బుతో ట్యాక్స్ లు కూడ కడుతున్నామని ఈ విషయాలు అందరూ గ్రహించవలసి అవసరం ఉంది అంటూ చిరంజీవి అభిప్రాయపడుతున్నాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి