టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగ చైతన్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  నాగ చైతన్య తన కెరియర్ ఎన్నో విజయవంతమైన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పరుచుకున్నాడు.  అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ఒక హీరోగా సపరేట్ క్రేజ్ ను ఏర్పరుచుకున్న నాగ చైతన్య తాజాగా విడుదలైన లవ్ స్టోరీ , బంగార్రాజు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మంచి బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్నాడు.  

ఇలా వరుస విజయాలను అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ  సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాశి ఖన్నా , నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాతో పాటు నాగ చైతన్య , అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్ద అనే హిందీ సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.  నాగ చైతన్య ఈ మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇలా విజయాలతో దూసుకుపోతూ, వరుస ప్రాజెక్ట్ లలో నటిస్తున్న నాగ చైతన్య ప్రస్తుతం దూత అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి  విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.  అమెజాన్ ప్రైమ్ వీడియో  రూపొందించే ‘దూత’ అనే వెబ్ సిరీస్‌ తో నాగ చైతన్య డిజిటల్ ప్లాట్ ఫామ్‌ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అమెజాన్‌ ప్రైమ్ వీడియో వారు  తమ ఫ్లాట్ ఫామ్ లో రూపొందిస్తున్న పలు వెబ్ సిరీస్ టైటిల్ లను తాజాగా  ప్రకటించారు. అందులో నాగ చైతన్య ‘దూత’ సిరీస్‌ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా దూత వెబ్ సిరీస్ లోని నాగ చైతన్య ఇంటెన్స్ లుక్‌ ను కూడా వదిలారు. ఇందులో ఎవరితోనే ఫోన్ మాడ్లాడుతూ నాగ చైతన్య సీరియస్‌గా చూస్తున్న లుక్ ఆకట్టుకుంటుంది. అలాగే ఈ వెబ్ సిరీస్ లోని  నాగ చైతన్య లుక్ ఆసక్తి రేపుతోంది.  ఈ వెబ్ సిరీస్ తో నాగ చైతన్య ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: