అమెరికాలో నివాసముంటు అక్కడ సిటిజెన్షిప్ పొందిన తనుశ్రీ దత్తా.. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చింది. అనంతరం మీద ఉద్యమంలో కూడా పలువురిపై ఆరోపణలు కూడా చేసింది. తన సహ నటుడు నానాపటేకర్ తన అసభ్యంగా ప్రవర్తించాడు అనే విషయాన్ని తెలియజేసింది. మీది ఉద్యమం చాలా ఉధృతంగా మారిన సమయంలో ఆమె తిరిగి మళ్ళీ అమెరికా కి వెళ్ళిపోయింది. అయితే ప్రస్తుతం తను శ్రీదత్తా యాక్సిడెంట్ గురైందని వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
ఈ ముద్దుగుమ్మకు రోడ్డు ప్రమాదం జరిగిందని.. ఆమె ఉజ్జయిని మహంకాళిని సందర్శించేందుకు వెళుతుండగా ఒక రోడ్డు ప్రమాదం జరిగిందని ఈ చేదు అనుభవాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. జీవితంలో మొదటి సారి ఇలా జరిగిందని ఆమె తెలియజేసింది. ఈ రోడ్డు ప్రమాదం వల్ల తన నమ్మకం మరింత బలపడిందని ఆమె తెలియజేసింది. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. అలా రక్తమోడుతునే మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్ళింది. ఇక గుడిలో ప్రతిష్ట వీడియోను షేర్ చేసి తడబడుతూ కనిపించడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి