మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి తొలిసారిగా నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ తీసిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా తిరు ఫోటోగ్రఫి ని అలానే మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోరమైన పరాజయం దిశగా కొనసాగుతోంది.

మెగాస్టార్ ఇందులో ఆచార్య అనే పాత్ర చేయగా రామ్ చరణ్, సిద్ద అనే పాత్రలో కనిపించారు. వాస్తవానికి వీరిద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించినప్పటికీ సినిమా యొక్క కథ, కథనాలను ప్రేక్షకాభిమానులని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు కొరటాల శివ పూర్తిగా విఫలం అయ్యారని, అలానే ఈ సినిమా చూస్తుంటే అసలు ఇది కొరటాల సినిమానే అని అనిపించిందని కొందరు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆ విధంగా ఆచార్య భారీ డిజాస్టర్ దిశగా ప్రస్తుతం కొనసాగుతోంది.

ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ మూవీ డెఫిషిట్ తో కొనసాగుతోందని చూడబోతే టాలీవుడ్ లో ఇప్పటివరకు భారీ పరాజయం అందుకున్న సినిమాల్లో ఆచార్య టాప్ ప్లేస్ లో నిలిచే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించిన భారీ ప్రతిష్టాత్మక మూవీ ఆర్ఆర్ఆర్ తో అతి పెద్ద సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ కి ఈ ఆచార్య భారీ డిజాస్టర్ ఒకింత దెబ్బేసిందని అంటున్నారు. అయితే దీని వలన ఆయన కెరీర్ కి ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ తండ్రి చిరంజీవి ఇమేజ్ తో పాటు తన ఇమేజ్ కూడా మూవీని ఏమాత్రం కాపాడలేకపోయిందని, మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఎంత మేర నష్టాలు మిగిల్చింది అనే తెలుస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: