తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లను పక్కన పెడితే.. ఎంతో మంది గొప్ప నటులలో నటుడు కోట శ్రీనివాసరావు కూడా ఒకరు. ఈయన ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శత్రువు, గణేష్ వంటి చిత్రాలలో దేశంలోనే మంచి నటుడిగా పేరు పొందాడు. ఈయన నటనకి అద్దం పట్టే ఎన్నో చిత్రాలలో నటించాడు కోట శ్రీనివాసరావు. ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం అని చెప్పవచ్చు. అప్పట్లో ఎన్టీఆర్ తో జరిగిన ఒక గొడవ తో బాగా పాపులర్ అయ్యాడు కోట.


కానీ ఆ తరువాత ఇప్పటివరకు ఎటువంటి వివాదాలలో తల దూర్చలేదు.  కానీ ఈ మధ్య ఈయన మాటలతో వరుస వివాదాలకు దారి తీస్తున్నాయి. గతంలో ప్రకాష్ రాజు పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం గా మారాయి. ఇక ఈయన కుమారుడు కూడా గతంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరు కూడా బాధ పడిన వారు ఉన్నారు. మొత్తానికి కోట ఒక విభిన్నమైన నటుడిగా పేరు పొందాడు. దీంతో ఈయన ని ఎంతో మంది అభినందించారు . సోషల్ మీడియాలో కూడా తరచూ ఈయన వీడియోలు పోస్ట్ అవుతూ ఉండేది.

ఇన్ని రోజుల పాటు అందరిలో ఒకరిగా ఉన్న కోట ..  ఈ మధ్య కాలంలో ఉన్నట్టుండి గత కొన్ని రోజుల నుంచి అనవసరపు వ్యాఖ్యలతో ప్రతి ఒక్కరి నోట మునుగుతూ నే ఉన్నారు. నటనకు గుడ్బై చెప్పేసి.. ఇంట్లో ఖాళీగా ఉన్న సమయాలలో పలు చానల్స్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాడు కోట. అలా కొంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీలోని నటుల పైన కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఈయనపై అభిమానులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎక్కువగా మెగా ఫ్యామిలీ పైన టార్గెట్ చేయడం, నందమూరి ఫ్యామిలీ ని పొగడటం వంటివి చేస్తూ ఉన్నారు. దీంతో ఈయన పరువు కాస్త ఈయనే తీసుకుంటున్నారు అన్నట్లుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: