మార్చి 25న విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని బాగా షేక్ చేసింది.

భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన ఈ మూవీలో ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. 1920 దశకం నాటి కథతో వచ్చిన ఈ సినిమాలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీంగా అద్భుతంగా నటించారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు కూడా వెల్లడించాయి.

సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 47 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 608.17 కోట్లకు పైగా వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 155.17 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుని తన హవాను చూపించింది. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై చాలా రోజులు అవుతున్నా కూడా సినిమా హవా ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. తారక్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన విషయం తెలిసిందే.



అతడి నటనకు యావత్ ప్రేక్షకులు కూడా సెల్యూట్ కొట్టారు.కొమురం భీముడో పాటలో తారక్ ఎక్స్‌ప్రెషన్స్‌కు జనం తెగ ఫిదా అయ్యారు. ఇప్పుడు తారక్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ అతడిని ఓ ఎగ్జామ్‌లోని క్వశ్చన్ పేపర్ ఎక్కేలా చేసిందట.. తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌లో ఓ ప్రశ్న అడిగారట.. 'ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్‌తో మీరు ఓ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేసి, ఆయన్ను ప్రశ్నలు అడిగి.. సమాధానాలు తెలుపుతూ ఓ వ్యాసం రాయాలి' అంటూ ఓ ప్రశ్న కనిపించిందట.. దీంతో ఈ క్వశ్చన్ పేపర్‌ను తారక్ అభిమానులు నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. తారక్ అంటే మాములు విషయం కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: