కొంతకాలం క్రితం వరకు పరాజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయిన నందమూరి నట సింహం బాలకృష్ణ టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అఖండ మూవీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ ప్రస్తుతం క్రాక్ మూవీ తో అదిరిపోయే విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎన్ బి కె 107  వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటుంది.  

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా,  దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో,  వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.  బాలకృష్ణ,  గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా తర్వాత టాలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరైన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.  ఈ సినిమా ఇటు అనిల్ రావిపూడి స్టైల్ కామెడీ ఎంటర్టైనర్ గా ,  అటు బాలకృష్ణ స్టైల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  

సినిమా తర్వాత బాలకృష్ణ తనకు ఇప్పటి వరకు మూడు విజయాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.  బాలకృష్ణ,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న 4 వ మూవీ ని  బోయపాటి శ్రీను పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు  ఒక వార్త వైరల్ అవుతుంది.  ఇలా అఖండ సినిమా సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ వరుస పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజీ దర్శకులను లైన్ లో  పెడుతూ ముందుకు దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: