నాగచైతన్యతో విడిపోయిన తరువాత సమంత స్పీడ్ కు ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ‘పుష్ప’ లో ఐటమ్ సాంగ్ చేసి సమంత తన గ్లామర్ స్టామినా ఏమిటో అందరికీ అర్థం అయ్యేలా తెలియచేసింది. ఒకవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే గ్లామర్ పాత్రలు చేయడానికి ఆశక్తికనపరుస్తోంది.

టాప్ యంగ్ హీరోలు ఎవరూ ఆమెతో నటించడానికి పెద్దగా ఆశక్తికనపరచక పోయినా మీడియం రేంజ్ యంగ్ హీరోలతో ఆమె నటిస్తూ తన హవా కొనసాగించడానికి గట్టిప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా ఆమె విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న క్యూట్ లవ్ స్టోరీలో ఒక డీప్ లిప్ లాక్ సీన్ విజయ్ దేవరకొండతో చేయడానికి అంగీకరించినట్లుగా వార్తలు రావడం ఇండస్ట్రీ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

లిప్ లాక్ సీన్స్ చేయడంలో విజయ్ దేవరకొండకు ఎటువంటి మొహమాటం లేదు. దీనితో మళ్ళీ విజయ్ దేవరకొండ సమంతల మధ్య చిత్రీకరించబోతున్న ఆ సీన్ గతంలో శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘మజిలీ’ సినిమాలోని నాగచైతన్య దివ్యాంష కౌషిక్ లపై చిత్రీకరించిన డీప్ లిప్ లాక్ సీన్ కు మించి మరింత ఘాటుగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీనితో సమంత స్పీడ్ వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ చాలామంది ఆశ్చర్య పోతున్నారు.


దీనివెనుక మరొక కారణం ఉంది అంటున్నారు. సమంతతో ఇండస్ట్రీలోకి వచ్చిన కాజల్ తమన్నా రకుల్ ప్రీత్ ల హవా ముగిసిపోయింది. వీరిలో చాలామంది పెళ్ళిళ్ళు అయి పిల్లలు కూడ పుడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో యంగ్ హీరోయిన్స్ రష్మిక పూజా హెగ్డేల హవా తట్టుకుని నిలబడాలి అంటే చాల సాహసాలు చేయాలి కాబట్టి సమంత ఇలా ప్రవర్తిస్తోంది అనుకోవాలి. వాస్తవానికి సమంత బాలీవుడ్ లో కూడ అవకాశాల గురించి ప్రయత్నిస్తూ ఉంటే ఆమెకు అక్కడ సెకండ్ హీరోయిన్ పాత్రలే లభిస్తు ఉండటంతో ఇక లాభం లేదనుకుని తనకు గుర్తింపు ఇచ్చిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన హవా కొనసాగించాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: