తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ  మూవీ లకు దర్శకత్వం వహిస్తూ ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన ఒక్క సినిమా కూడా అపజయం పాలు కాకుండా వరుస విజయా లతో దూసుకుపోతున్న దర్శకులలో ఒకరైన అనిల్ రావిపూడి గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఒక అపజయం కూడా లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఇది వరకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా మంచి విజయం సాధించడంతో ఆ మూవీ కి సీక్వెల్ గా ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ ని తెరకెక్కించాడు ఎఫ్ 2 సినిమాలో హీరో , హీరోయిన్ లుగా నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్... తమన్నా , మెహరీన్ ఎఫ్ 3 సినిమాలో కూడా హీరో, హీరోయిన్ లుగా నటించారు. వీరితో పాటు ఈ మూవీ లో ఆలీ ,  సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.  ఇది ఇలా ఉంటే ఎఫ్ 2 సినిమా మంచి విజయం సాధించడంతో ఎఫ్ 3 మూవీ కి నటీనటులు వారి పారితోషికాన్ని కాస్త పెంచినట్లు తెలుస్తోంది.

ఈ క్రమం లో వెంకటేష్ ఎఫ్ 3 మూవీ కోసం 15 కోట్లు, వరుణ్ తేజ్ 13 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించిన తమన్నాకు 1.8 కోట్ల రెమ్యునరేషన్  ఇచ్చారట, మెహరీన్ కు  80 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇది ఇలా ఉంటే ఎఫ్ 3 మూవీ మే 27 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: