నాచురల్ స్టార్ నాని గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి చిన్న స్థాయి నుండి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయాడు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయిన నాచురల్ స్టార్ నాని తాను నటించిన వి మరియు టక్ జగదీష్ సినిమాలను థియేటర్లలో కాకుండా 'ఓ టి టి' లో విడుదల చేసి తన అభిమానులను కాస్త నిరుత్సాహ పరిచాడు. అలా తను నటించిన రెండు సినిమాలను 'ఓ టి టి' లో విడుదల చేసి తన అభిమానులను నిరుత్సాహపరిచిన నాని,  ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్  సినిమాని థియేటర్లలో విడుదల చేశాడు.  

థియేటర్లలో విడుదల అయిన శ్యామ్ సింగరాయ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా శ్యామ్ సింగరాయ్ సినిమా విజయంతో మంచి జోష్ లో ఉన్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం అంటే సుందరానికి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాతో పాటు నాని 'దసరా'  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రెండు క్రేజీ సినిమాలలో హీరోగా నటిస్తున్న నాచురల్ స్టార్ నాని , పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వున్న దర్శకుడి సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  

అసలు విషయం లోకి వెళితే...  కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇలా ఇప్పటికే ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను  సెట్ చేసి పెట్టుకున్న ప్రశాంత్ నీల్ మరికొంత కాలంలో నాని హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నట్లు  ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.  మరి ఈ వార్త ఎంతవరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: