యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో ఇది వరకు జనతా గ్యారేజ్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది. ఇలా జనతా గ్యారేజ్ సినిమా మంచి విజయం సాధించడంతో తాజాగా ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు  కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే తాజా సినిమా ఎన్టీఆర్ కు కెరియర్ పరంగా 30 వ సినిమా.  ఎన్టీఆర్ 30 వ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ గా కన్ఫార్మ్ చేసింది. ఇది ఇలా ఉంటే అనిరుద్ రవిచంద్రన్ , ఎన్టీఆర్ సినిమా కోసం ఒక అదిరిపోయే మాస్ బీట్ సాంగ్ ను రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనిరుద్ రవిచంద్రన్ ఎంతో మంది మాస్ హీరోలకు అదిరిపోయే మాస్ బీట్ సాంగ్ లను కంపోజ్ చేసి అదరగొట్టాడు. అదే రేంజ్ లో ఎన్టీఆర్ సినిమా కోసం కూడా ఒక మాస్ బీట్ సాంగ్ ను కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

అనిరుద్ రవిచంద్రన్ కంపోజ్ చేయబోయే ఈ మాస్ బీట్ సాంగ్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రేమికులు కూడా ఎంతగానో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ 30 వ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నాడు.  ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30 వ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ గురించి  మాత్రం చిత్ర బృందం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: