అప్పుడప్పుడే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న చిన్న దర్శకులు ఎవరైనా సరే స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు. హమ్మయ్య.. దేవుడు ఇన్నాళ్లకి నాకు కరుణించాడు. అదృష్ట లక్ష్మీ కటాక్షించింది.. పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం వచ్చింది అని ప్రతి చిన్న దర్శకుడు భావిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇప్పుడు ఎలాగైనా తమ ప్రతిభను నిరూపించుకుని ఇక స్టార్ డైరెక్టర్ గా ఎదగాలని భావిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా చిన్న దర్శకుడు స్టార్ హీరో సినిమా నుంచి ఆఫర్ వస్తే తిరస్కరించడం అసాధ్యం అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం నేను పెద్ద హీరో ఆఫర్ ని తిరస్కరించాను అంటూ చెబుతూ ఉన్నాడు పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్.


 విజయ్ దేవరకొండ హీరోగా పరిచయమైన పెళ్లిచూపులు సినిమా కు అటు తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది ఈ సినిమా మరోసారి యూత్  బాగా ఆకట్టుకుంది. మంచి విజయాన్ని సాధించాడు. అంతేకాదండోయ్ పలు సినిమాల్లో నటుడిగా కూడా తనలో ఉన్న ప్రతిభను చాటుకున్నాడు. ఇంకోవైపు కొన్ని కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా అవతారమెత్తి మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు తరుణ్ భాస్కర్. కానీ ఇప్పుడు మాత్రం అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్న తరుణ్ భాస్కర్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ సినిమాలను రిజెక్ట్ చేశారట కదా అంటూ అడగగా.. అవును రిజెక్ట్ చేశాను అంటూ తెలిపాడు. సల్మాన్ ఖాన్ ఓ రోజు ఫోన్ చేసి నాతో సినిమా చేస్తావా అంటూ అడిగితే.. ఇక ఫోన్ లోనే రిజెక్ట్ చేయకుండా నేరుగా వెళ్లి సినిమా మీతో చేయలేను అని చెప్పాను అంటూ తరుణ్ భాస్కర్ అన్నాడు. రిజెక్ట్ చేయడానికి ముంబై వెళ్లాల్సిన పనేంటి అంటూ అని ప్రశ్నించగా..  ఏమో అలా అనిపించింది ముంబై కూడా చూడొచ్చు కదా అని వెళ్ళాను అంటూ ఆసక్తికర సమాధానం చెప్పాడు. సల్మాన్ ఖాన్ సినిమా రిజెక్ట్ చేసిన విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: