రాజకీయాల్లోకి వెళ్లి సినీరంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమా చేసి తమ సత్తా ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించారు.


ఇక ఆ తరువాత వచ్చిన సైరా సినిమా సైతం ప్రేక్షకులలో మంచి స్పందన అయితే తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు ప్రకటిస్తూ ఏమాత్రం ఖాళీ లేకుండా సినిమా షూటింగ్లో పాల్గొంటూ ముందుకు వెళుతున్నారట.. అయితే ఇటీవలే కుర్ర డైరెక్టర్ తో సినిమా ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవిసినిమా స్క్రిప్ట్ విషయంలో సంతోషంగా లేరని సమాచారం.ఆయన ఏకంగా సినిమా నిలిపివేసినట్లు కూడా ప్రచారం జరుగుతోందిట.ఆ వివరాల్లోకి వెళితే
 

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ ఒక కీలక పాత్రలో నటించడంతో అటు మెగా అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులలలో కూడా సినిమా మీద విపరీతమైన అంచనాలు ఆశలు ఏర్పడ్డాయి దానికి అనుగుణంగా ఈ సినిమాలో విలన్గా సోనూసూద్ నటించగా హీరోయిన్గా పూజ హెగ్డే కూడా నటించింది.


 


అపజయమెరుగని కొరటాల శివ దర్శకత్వంలో మెగా తండ్రి కొడుకులు కలిసి నటించడంతో సినిమా మీద అంచనాలు కూడా అంతకంతకూ పెరిగి పోయాయి. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందట.. అయినా సరే ఫలితంతో ఏ మాత్రం సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి భార్యతో కలిసి అమెరికా వెకేషన్ వెళ్తే రామ్ చరణ్ తేజ తన తదుపరి చిత్రం షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారట.


 


ఇక మెగాస్టార్ చిరంజీవి తిరిగి వచ్చిన తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉన్నది.. ఈ సినిమాతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమా రీమేక్ అయిన బోలా శంకర్ సినిమా కూడా చేస్తున్నారు. అలాగే దర్శకుడు బాబీ డైరెక్షన్ లో వాల్తేర్ వీరయ్య అనే సినిమా కూడా చేస్తున్నారట.


 


ఇక ఈ సినిమాలతో మంచి జోష్ లో ఉండగానే ఆయన యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందంటూ ప్రచారం కూడా జరిగింది దానికి క్లారిటీ ఇస్తూ నిజంగానే దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రకటించారు. ఆ సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మించాల్సి ఉన్నది.


 


అయితే తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయడం లేదని సమాచారం.తొలుత స్టోరీ లైన్ విని సినిమాకు ఓకే చెప్పారని ఇప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి ఏమాత్రం సంతృప్తికరంగా లేదని సమాచారం.రెండు సార్లు భేటీ అయిన తర్వాత కూడా ఆయనకు సినిమా మీద నమ్మకం కలగక పోవడంతో సినిమా పనులు నిలిపివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన వస్తే కానీ నిజమని మనం చెప్పలేం. ఇక సినిమా నిలిచిపోయిన ప్రచారం మాత్రం ఫిలిం వర్గాలలో పెద్ద ఎత్తునే జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: