అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అవ్వడం తో ఇప్పుడు మరో సినిమాను వెంటనే పట్టాలెక్కిస్తున్నారు.. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు..స్టైలిష్ స్పై థ్రిల్లర్‌ గా రూపుదిద్దుకుంటున్న 'ఏజెంట్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మనాలిలో హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని సూపర్వైజ్ చేస్తున్నారు. అఖిల్‌ తో పాటు చిత్రంలోని కీలక నటీనటులు షూటింగ్‌ లో పాల్గొంటున్నారు.
 

ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమా పై భారీ అంచనాలను పెంచుతుంది.. ముఖ్యంగా అఖిల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రం అఖిల్ కెరియర్ లో బెస్ట్ గా నిలవనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌ లో దర్శకుడు సురేందర్ రెడ్డి, డీవోపీ రసూల్ ఎల్లోర్, విజయ్ మాస్టర్‌ సెట్స్ లో కనిపించారు..హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యారు.

 

ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నారు. అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదల చేయాలనీ భావిస్తున్నారు.అఖిల్ కు మంచి ఫెమ్ ను అందిస్తుందని తెలుస్తుంది..మొత్తానికి ఇది ఘన విజయాన్ని అందుకోవడం ఖాయమని అక్కినేని అభిమానులు అంటున్నారు. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: