కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేకపోయినా తమిళ్ లో శివకార్తికేయన్ తో చేసిన డాక్టర్ సినిమాతో బాగా క్రేజ్ పెంచుకుంది. తెలుగులో ఈ మూవీ డబ్ అవడంతో హిట్ అందుకుని ఇక్కడా బాగా పాపులర్ అయ్యింది ఈ గ్లామరస్ డాల్. ఆ తర్వాత స్టార్ హీరో సూర్య చిత్రం ఈ టి లో హీరోయిన్ గా చేసి మరో హిట్ ను అకౌంట్ లో వేసుకుంది. ఇక తాజాగా శివకార్తికేయన్ తో మరోసారి జతకట్టి డాన్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా ఈమె చేస్తున్న వరుస చిత్రాలు సూపర్ హిట్ అవుతుండటంతో తెలుగులో కొందరు హీరోలు తమ చిత్రం లో ప్రియాంక హీరోయిన్ గా చేస్తే బాగుంటుందని అంటున్నారట.
ఇప్పటికే ఓ ఇద్దరు టాలీవుడ్ దర్శకులు తమ చిత్రాల్లో హీరోయిన్ గా ప్రియాంక ను సెలక్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలతో తెలుగులో ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలా ప్రియాంక ఆరుల్ తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం మొదలయింది. అయితే ఇంతకీ ఆ సినిమాలు నిజమేనా..ఏ హీరో చిత్రాలు అనేవి తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి