నిహారిక ఎన్ ఎమ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్. ఈమె పెట్టే వీడియోలు చాల డిఫరెంట్ గా ఉండటంతో 25 సంవత్సరాలు కూడ లేని ఈమెకు సోషల్ మీడియాలో లక్షలాదిగా అభిమానులు ఉన్నారు. ఈమెకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడ అభిమానిగా మారడం అత్యంత ఆశ్చర్యకరం.



‘సర్కారు వారి పాట’ ను ప్రమోట్ చేస్తూ ఈమె చాల డిఫరెంట్ ఐడియాలతో వీడియోలు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈమె టాలెంట్ ఈవారం విడుదల కాబోతున్న ‘మేజర్’ మూవీకి కూడ ఉపయోగ పడుతోంది. నిహారిక చేసే వీడియోలు చాల నేచురల్ గా ఉంటాయి. సినిమా కథలోంచి ఐడియాలు తీసుకుని ఆమె చాల డిఫరెంట్ గా వీడియోలు చేస్తుంది.



ప్రస్తుతం క్యాలిఫోర్నియా లోని ఛాష్మన్ యూనివర్సిటీలో ఈమెఎంబిఎ చేస్తోంది. ఈమెకు ఇన్ ష్టా గ్రామ్ లో ఉన్న ఫాలోయింగ్ ను చూసి జర్మనీ లోని ఒక ప్రముఖ యూనివర్సిటీ ఎంబిఎ విద్యార్ధులు ఆమెను కేస్ స్టడీగా తీసుకోవడం ఆమె సమర్థతను సూచిస్తోంది. చెన్నయ్ లో పుట్టిన నీహారిక తాను దక్షిణాదికి చెందిన అమ్మాయిని అంటూ దక్షిణాది లోని అన్ని ప్రముఖ సినిమాలను ప్రమోట్ చేస్తూ ఈమె వీడియోలు చేయడం సంచలనం. సినిమాలు అంటే విపరీతమైన క్రేజ్ ఉన్న నిహారిక తన క్రేజ్ ను కూడ తెలివిగా ఉపయోగించుకుంటు తన క్రియేషన్ తో వీడియోలు చేసి ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆమె ఒక సంచలనంగా మారింది.


మహేష్ తన సినిమాల కోసం ఆమెతో వీడియోలు చేయిస్తున్న పరిస్థుతులలో కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడ ఆమెతో తమ సినిమాల ప్రమోషన్ ఆమె వీడియోలతో చేయించుకోవడానికి లక్షల రూపాయలలో పారితోషికాలు ఇస్తున్నట్లు టాక్. ఎటువంటి టాలెంట్ ఉంటే చాలు డబ్బు దానంతట అదే మన గడపలోకి వస్తుంది అనడానికి నిహారిక ఉదాహరణ. ప్రస్తుతం ‘మేజర్’ ప్రమోషన్ లో ఈమె చాలకీలకంగా మారడంతో మీడియాలో ఈమె పై వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: