చాలా ఏళ్ళ విరామం తరువాత కమల్ నటించిన విక్రమ్ మూవీ సూపర్ గా కలెక్షన్స్ అదరగొడుతూ దూసుకెళుతూ ఉండడంతో ఆయన ఫ్యాన్స్ అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ యాక్టింగ్, ఫైట్స్, స్వాగ్, డైలాగ్స్ ఎంతో ఆకట్టుకుంటాయి. అలానే నెగటివ్ రోల్ చేసిన విజయ్ సేతుపతి, మరొక కీలక రోల్ చేసిన ఫహాద్ ఫాసిల్ కూడా అదరగొట్టే పెర్ఫార్మన్స్ కనబరిచారు. ఆద్యంతం ఆకట్టుకునే కథనాలతో ఈ సినిమాని ప్రేక్షకాభిమానులు మెచ్చేలా తెరకెక్కించిన దర్శకడు లోకేష్ పూర్తిగా సఫలం అయ్యారు అనే చెప్పాలి.
అయితే విషయం ఏమిటంటే, ఇటు తెలుగులో కూడా విక్రమ్ ఎంతో అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మరోవైపు అటు అడివి శేష్ నటించిన మేజర్ సినిమా కూడా మంచి టాక్ సంపాదించి ముందుకు సాగుగుతున్నప్పటికీ ఇటు కూడా విక్రమ్ కూడా మంచి కలెక్షన్ సాధిస్తోందని, ఈ మూవీ సూపర్బ్ టాక్ ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో అన్ని భాషల్లో ఈ సినిమా ఈ విధంగా కలెక్షన్స్ ఊచకోత కొనసాగించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ సినిమా ఓవరాల్ గా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి. కాగా తమ సినిమా అందరి అంచనాలు అందుకుని అన్ని భాషల్లో అదరగొట్టే రేంజ్ లో దూసుకెల్తూ ఉండడంతో కమల్ హాసన్ సహా విక్రమ్ యూనిట్ మొత్తం కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ ఇమేజ్ ఒక్కసారిగా విపరీతంగా పెరిగిందని, ఇక ప్రస్తుతం ఆయనకు టాలీవుడ్, బాలీవుడ్ నుండి సైతం మంచి ఆఫర్లు వస్తున్నట్లు చెప్తున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి