ఇప్పుడు సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా టైటిల్ పెట్టడానికి వెనకాల దాని వెనుక సమంత బలవంతమే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో సమంత క్యారెక్టర్ పేరు ఖుషి అని తెలుస్తోంది. ఆమె ఓ ముస్లిం అమ్మాయి పాత్ర లో నటిస్తుందని అంటున్నారు. ఈ పాత్ర కు అంత ఇంపోర్టన్స్ ఉంది కాబట్టే ఆ పాత్రకు సమంత ఎంపిక చేశారట. సమంత పాత్ర చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుందట. అందుకే ఈ సినిమా కు ఈ టైటిల్ పెట్టవలసి వచ్చింది అంటున్నారు.
వాస్తవానికి ఈ సినిమాకు ఖుషి టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. విజయ్ అభిమానులు కూడా దీనిపట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. దర్శకుడు శివ నిర్వాణ కూడా ఈ టైటిల్ ఆలోచన రాగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేయాలనీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తో వస్తున్న సినిమా ఆ ఖుషి తరహాలో సంచలన విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి. విజయ్ దేవరకొండ కూడా ఈ టైటిల్ కే మొగ్గు చూపడంతో ఈ సినిమా కి ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యిందట.