అడవి శేషు హీరోగా తెరకెక్కిన మేజర్ సినిమా జూన్ 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మేజర్ మూవీ కి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు.

మూవీ లో సాయి మంజ్రేకర్ , శోభితా ధూళిపాళ కీలక పాత్రలలో నటించగా, ప్రకాష్ రాజు ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి వున్న మేజర్ సినిమా విడుదల అయిన మొదటి షో నుండి మంచి టాక్ ను బాక్సాఫీస్ దగ్గర తెచ్చుకోవడంతో ఈ సినిమాకు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. అలాగే ఇప్పటికే మేజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే మేజర్ సినిమా 9 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.13 కోట్ల షేర్ , 1.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి ఇప్పటికి కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి హోల్డ్ ను కనబరుస్తోంది. మేజర్ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 18 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ సినిమా 19 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగింది.

మొదటి నుండి ఈ సినిమా పై అంచనాలు ఉండటం, అలాగే విడుదల అయిన మొదటి షో నుండే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, అతి తక్కువ రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది.  ఇప్పటి వరకు మేజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 27.76 కోట్ల షేర్,  50.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. దీనితో ఇప్పటి వరకు మేజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8.76 కోట్ల లాభాలను తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: