నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ''అంటే సుందరానికీ'' మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది..ఆ సినిమా మొదలైనప్పటి నుంచి  థియెటర్ లోకి వచ్చే అంత వరకూ జనాల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.దీంతో ఇప్పుడు జనాలు సినిమా పై ఆసక్తిని చూపిస్తున్నారు..దర్శకుడు వివేక్ ఆత్రేయ ప్యూర్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని కనబరిచారు. ఇక ఈ సినిమాను జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాలు మధ్య రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండనుండటంతో ఈ సినిమాను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

నజ్రియా నాజిమ్‌తో నాని కెమిస్ట్రీ కూడా సూపర్బ్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్‌ను చూపిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు రోజులు పూర్తయ్యేసరికి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్స్‌ను వసూలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.14.95 కోట్ల షేర్ వసూళ్లు సాధించి నాని కెరీర్‌లో మరో హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో నాని సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..వివేక్ ఆత్రెయ సంగీతాన్ని అందించారు..

సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేయగా, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.30 కోట్లకు అమ్ముడయ్యాయి..సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 4.54 కోట్లు
సీడెడ్ – 1.07 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.15 కోట్లు
ఈస్ట్ – 0.84 కోట్లు
వెస్ట్ – 0.73 కోట్లు
గుంటూరు – 0.80 కోట్లు
కృష్ణా – 0.74 కోట్లు
నెల్లూరు – 0.53 కోట్లు
ఏపీ మరియు తెలంగాణాలో కలిపి 10.40 కోట్లు..
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1 కోట్లు
ఓవర్సీస్ – 3.55 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ – రూ.14.95 కోట్లు..


మరింత సమాచారం తెలుసుకోండి: