రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మాస్ మసాలా చిత్రం గా రాబోతుంది. చాలా రోజుల నుంచి ఈ కాంబోలో సినిమా రాబోతుంది అని వార్తలు వినిపించగా ఫైనల్ గా ఈ సినిమా ఉంది అన్నట్లుగా మేకర్స్ ఇటీవలే ఈ సినిమా యొక్క ప్రకటన ను అధికారికంగా చేశారు. మాస్ చిత్రాలకు పెట్టింది పేరు గా ఉన్న బోయపాటి శ్రీను ఈ చిత్రంలో రామ్ ను ఏ విధంగా చూపిస్తాడో చూడాలి.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత తనను తాను పూర్తిగా మార్చుకున్న రామ్ ఇప్పుడు బోయపాటి శీను సినిమా ను ఏ స్థాయిలో చేస్తాడో చూడాలి. రామ్ కూడా మాస్ హీరోగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే తప్పకుండా భారీస్థాయిలో ఆయనకు ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇంకొకవైపు ఇప్పటికే ఆయన హీరోగా నటించిన వారియర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు. 

జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తూ ఉండగా లింగుస్వామి దర్శకత్వం వహించడం ఈ సినిమా పట్ల ఇంతటి స్థాయిలో అంచనాలు కలిగి ఉండటానికి ముఖ్య కారణం. మరి వరుస సక్సెస్ లతో జోరుమీద ఉన్న రామ్ ఈ చిత్రంతో కూడా విజయాన్ని అందుకొని ముందుకు వెళతాడా అనేది చూడాలి. ఇంకొకవైపు బోయపాటి శ్రీను రామ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ స్క్రిప్ట్ రెడీ చేశాడని అంటున్నారు. ఇందులో బాలయ్య అభిమాని గా కనిపించబోతున్నాడట రామ్. గతంలో నాని బాలయ్య అభిమానిగా ఓ సినిమాలో నటించగా ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో నటించనున్నాడు రామ్. మరి బాలయ్య సినిమా విజయంలో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: