టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోలుగా నిలదొక్కుకోవాలంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాస్ సినిమాలు చేయాలి యువ హీరోలు.  ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ కూడా తొలి రెండు మూడు సినిమాలతోనే సినిమాలు చేసే విధంగా అడుగులు వేయడం వల్లనే వారు ఇప్పుడు ఈ స్థాయిలో హీరో లుగా ఎదిగగలిగారు. ఆ విధంగా ఒక మాస్ సినిమాతో సరైన విజయం సాధిస్తే తప్పకుండా ఆ హీరోకి తిరుగు ఉండదు.

అన్న ఇప్పుడు ఓ యంగ్ హీరో తాను చేయబోతున్న నాలుగవ సినిమాతోనే మాస్ హీరోగా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇది ఆయన కెరీర్ కు మంచి సంకేతం అనే చెప్పాలి. ఉప్పెన లాంటి ప్రేమ కథ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయిన హీరో వైష్ణవ్ తేజ్ రెండో సినిమా గా చేసిన కొండపొలం చిత్రంతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ విధంగా మూడో సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని రంగ రంగ వైభవంగా అనే ఓ పొలిటికల్ నేపథ్యంలోనే సినిమా చేస్తున్నాడు. 

అయితే ఒక సాధారణ హీరో లవ్ సినిమాలు చేసుకునే హీరో పెద్ద హీరో గా ఎదగాలి అంటే తప్పకుండా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంది అందుకే ఇప్పుడు తన నాలుగవ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి ఒక మాస్ సినిమా తో సిద్ధమవుతున్నాడు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు జరిగింది. శ్రీ లీలా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ లాంఛనంగా మొదలు కాగా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది. తొందరలోనే తన మూడవ సినిమాను విడుదల చేయబోతున్నాం వైష్ణవ్ తేజ్ ఇప్పుడు 4వ సినిమా అధికారిక ప్రకటన చేయడం నిజంగా మెగా అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. మరి ఈ సినిమాల ద్వారా ఆయన ఎలాంటి విజయాలను నమోదు చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: