అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మొదట బాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకొని, ఆ తర్వాత భారత్ అనే నేను మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ తర్వాత అతి తక్కువ కాలంలోనే కీయారా అద్వానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇలా అతి తక్కువ కాలంలోనే రెండు తెలుగు సినిమాల్లో నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ లోనే సినిమాలను చేస్తూ కొనసాగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కియారా అద్వానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ , కీయారా అద్వానీ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే కియారా అద్వానీ బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సిద్ధార్థ్ తో ప్రేమలో ఉన్నారు అని, వారిద్దరికీ బ్రేకప్ అయ్యింది అని, అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే.

అయితే ఈ విషయాలపై కియారా అద్వానీ కానీ సిద్ధార్థ  స్పందించలేదు.  తాజాగా ఈ ముద్దుగుమ్మ ఈ వార్తలపై స్పందించింది. కియారా అద్వానీ ఈ విషయంపై స్పందిస్తూ...  ప్రస్తుతం నాకు ఇలాంటి వార్తలను పట్టించుకునే అంత తీరిక లేదు. ఈ రకం వార్తలను సృష్టించే వారు ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం లేదు. నాకు సంబంధించిన వ్యక్తిగత విషయాల గురించి నా కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే చేర్చిస్తాను అని కియారా అద్వాని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: