సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమందికి మొదటి సినిమాతోనే మంచి విజయాలు దక్కుతూ ఉంటాయి. అలా నటించిన మొదటి సినిమా మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఆ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో జనాల మనస్సు లను దోచుకున్నట్లు అయితే వారికి వరుస పెట్టి సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి.

అలా మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకొని మొదటి సినిమా లోనే తన అందచందాలతో, నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలలో కృతి శెట్టి ఒకరు. అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు అనేక అవకాశాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే కృతి శెట్టి నటించిన బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ సినిమాలు విడుదల కావడం, మంచి విజయాలను సాధించడం కూడా జరిగిపోయాయి. ప్రస్తుతం కృతి శెట్టి, రామ్ పోతినేని సరసన ది వారియర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా జూలై 14 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ సినిమా తో పాటు నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

సినిమా ఆగస్ట్ 12 వ తేదిన విడుదల కాబోతుంది. అలాగే సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ఇప్పటికే వరుస సినిమాలలో నటిస్తున్న ప్రతి శెట్టి తాజాగా నాగ చైతన్య,  వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కబోయే తాజా సినిమాలో కూడా అవకాశాన్ని కొట్టేసింది. ఇలా కృతి శెట్టి వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ స్పీడ్ లో దూసుకు వెళుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: